ఈ బెజవాడ పోలీసులు ఏం చేశారో చూడండి (వీడియో)

విజయవాడలో ట్రాఫిక్ పోలీసులు చేసిన సాహసంతో  నిండు ప్రాణం నిలిచింది. విజయవాడలోని కాళేశ్వరరావు మార్కెట్ సమీపంలోని రైల్వే ట్రాక్ నుంచి ప్రమాదవశాత్తు రామకృష్ణ అనే వ్యక్తి కాల్వలో జారిపడ్డాడు. కాల్వలోని బ్రిడ్జి పిల్లర్ ను పట్టుకొని  రక్షించండి అంటూ అరుపులు, కేకలు వేయడంతో గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు, రైల్వే ట్రాక్ మెన్స్ అతనిని తాళ్లతో పైకి లాగి కాపాడారు. ఓ నిండు ప్రాణాన్ని కాపాడిన పోలీసు అన్నలను ప్రజలు ప్రశంసించారు. రామకృష్ణను పోలీసులు కాల్వలో నుంచి కాపాడిన వీడియో కింద ఉంది చూడండి.

[videopress e4gAwC9E]