చికెన్ సెంటర్ ముందు టిఆర్ఎస్ నేత, ఇదేం పని? (వీడియో)

ఎన్నికల వేళ టిఆర్ఎస్ నేతలు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ఏ ఊరిలో చూసినా  టిఆర్ఎస్ నేతలు చేస్తున్న పనులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

కూటి కోసం కోటి విద్యలు అన్న డైలాగ్ ను వంటబట్టించుకున్నారు టిఆర్ఎస్ అభ్యర్థులు. అందుకే ఓటు కోసం వారు కోటి విద్యలు చేస్తున్నారు. కొందరు స్నానం చేస్తుంటే ఒల్లు రుద్దుతున్నారు. మరికొందరు బట్టలు ఇస్త్రీ చేస్తున్నారు. కారం దంచుతున్నారు. మగ్గాలు నేస్తున్నారు.

కొందరు అభ్యర్థులు కల్లు అమ్మి ఓట్లు అడుగుతున్నారు. కొందరేమో చాయ్ అమ్ముతూ హల్ చల్ చేస్తున్నారు. ఏకంగా స్పీకర్ మధుసూదనాచారి అయితే ఒక పెద్ద మనిషి కాళ్లు మొక్కి ఓట్లడిగే స్థాయికి వెళ్లిపోయారు.

అయితే జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్థి తాటికొండ రాజయ్య అనుచరుడు ఒక పబ్లిక్ గా ఒక నిర్వాకం చేసి మీడియా కెమెరాలకు చిక్కిపోయారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన మహిళలకు ఆయన డబ్బులు పంపిణీ చేశారు.

చికెన్ సెంటర్ ముందు డబ్బు పంపిణీ చేపట్టడం వివాదాస్పదమైంది. అందరినీ క్యూ లైన్ లో నిలబెట్టి ఒక్కొక్కరికి వంద రూపాయలు ఇస్తూ తాటికొంద రాజయ్య అనుచరుడు దొరికిపోయారు. 

మరి ఎన్నికల కమిషన్ పెద్ద సార్లు దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు. రాజయ్య అనుచరుడు డబ్బుల పంపిణీ చేసిన వీడియో కింద ఉంది చూడండి.

TRS Leaders Distribute Money to Public