తండ్రి మాట పెడచెవిన పెట్టిన కూతురు… ఆ తండ్రి చేసిన పనికి అందరూ షాక్..?

ప్రస్తుత కాలంలో యువత చదువు మీద దృష్టి పెట్టకుండా నిత్య మొబైల్ ఫోన్ తో సమయం గడుపుతున్నారు. అంతే కాకుండా మరికొంత మంది ప్రేమలో పడి వారి చదువును నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో వారి తల్లదండ్రులు ఆగ్రహంతో వారిని శిక్షిస్తున్నారు. మరికొంతమంది తల్లి తండ్రులు క్షణికావేశంలో పిల్లల ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా ఉత్తర ప్రదేశ్ లో ఎటువంటి దారుణ సంఘటన చోటుచేసుకుంది. ప్రియుడి మోజులో పడి నిత్యం అతనితో మాట్లాడుతూ చదువుకుని నిర్లక్ష్యం చేసిన కూతురిని తండ్రి దారుణంగా హత్య చేశాడు.

వివరాలలోకి వెళితే..ఉత్తరప్రదేశ్ బాగ్‌పత్ చాందినగర్ సమీపంలోన పంచి గ్రామంలో నివసిస్తున్న ప్రమోద్ అనే వ్యక్తి హోంగార్డుగాపని చేస్తున్నాడు. అతనికి నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో జియా(16) అనే బాలిక అందరికంటే పెద్దది. పదో తరగతి చదువుతున్న జియా.. చదవడంపై దృష్టి పెట్టకుండా తరచూ ఒక యువకుడితో ఫోన్లలో మాట్లాడుతూ ఉండేది. ఈ క్రమంలో ఓ రోజు తండ్రి గమనించి కూతుర్ని గట్టిగా మందలించాడు. అయినప్పటికీ జియా ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పూ రాలేదు. కొన్ని రోజుల క్రితం గ్రామానికి చెందిన ఓ యువకుడితో తన కూతురు కలిసి ఉండడాన్ని ప్రమోద్ గమనించాడు.

దీంతో ఆగ్రహానికి గురైన ప్రమోద్ మరొకసారి కూతురిని మందలించాడు. అయినా కూడా ఫిబ్రవరి 23న జియా తన ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతుండడం గమనించిన ప్రమోద్‌ కోపం కట్టలు తెంచుకుంది. దీంతో కూతురుపై విచక్షణా రహితంగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా కూతురు మృతదేహాన్ని.. సోదరుడు మోహిత్‌తో కలిసి సమీపంలో ఓ నదిలో పడేశాడు. అనంతరం ఏమీ ఎరుగనట్లు డ్యూటీకి వెళ్లిపోయాడు. మార్చి 1న గుర్తు తెలియని వ్యక్తి.. పోలీసులకు ఫోన్ చేసి మృతదేహం గురించి చెప్పాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టి నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమోద్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు.