పిల్లలను కిరాతకంగా చంపిన భర్త.. కోపంతో భర్త గొంతు కోసి ప్రతీకారం తీర్చుకున్న భార్య!

ప్రస్తుత కాలంలో అన్యోన్యంగా ఉండాల్సిన భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు అనుమానాలు పెంచుకొని దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది మహిళలు భర్త పెట్టే వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే మన కొంతమంది మాత్రం హత్యలు చేయడానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా ఇటువంటి దారుణ సంఘటన కొల్లాపూర్‌ లో చోటు చేసుకుంది. భార్య మీద అనుమానంతో ఇద్దరు పిల్లల్ని గొంతు కోసి చంపిన భర్త పై కక్ష పెట్టుకున్న భార్య అతడిని కూడా గొంతు కోసి దారుణంగా హత్య చేసింది.

వివరాలలోకి వెళితే…కొల్లాపూర్‌ మండలం కుడికల్ల గ్రామానికి చెందిన ఓంకార్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన మహేశ్వరి అని మహిళను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి చందన (3), విశ్వనాథ్ (1) పిల్లలు ఉన్నారు. అయితే కొన్ని రోజులుగా మరి మీద అనుమానం పెంచుకున్న ఓంకార్ ఆమెను వేధించేవాడు. భార్య పిల్లల మీద అనుమానం ఉన్న ఓంకార్ తనకి మూడవ సంతానం కావాలని భార్యను వేధించడంతో ఆమె అందుకు నిరాకరించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఓంకార్ ఎత్తం గ్రామ సమీపంలోని గట్టు ప్రాంతంలో ఇద్దరి పిల్లలను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత అతడు కూడా గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్న సమయంలో ఓంకార్ కోలుకొని శుక్రవారం ఆస్పత్రి నుండి ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఓంకార్ ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు. అనుమానంతో భార్యను వేదించే వాడు. దీంతో అతని ప్రవర్తనతో విసుగు చెందిన రాజేశ్వరి తన పిల్లల్ని చంపాడన్న కక్ష్య తో ఆదివారం ఉదయ ఓంకార్ నిద్రిస్తుండగా అతని గొంతు కోసి దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత తానే స్వయంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి భర్త పెట్టే వేధింపులు భరించలేక అతనిని హత్య చేశానని చెప్పి కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.