అమెరికాలో తెలుగు విద్యార్థుల కేసులో ఒకరికి బెయిలు

అమెరికాలో అరెస్టయిన తెలుగు ‘విద్యార్థు’లు అమాయకులని, బ్రోకర్ల వలలో పడి మోసపోయారని భారత్ ప్రభుత్వం చేస్తున్న వాదనను అమెరికా హోం లాండ్ సెక్యూరీటీ అధికారులు అంగీకరించడం లేదు.

డెట్రాయిట్ లోని ఫార్మింగ్టన్ యూనివర్శిటీ పేరుతో అక్కడి అధికారులు జరిపిన స్టింగ్ ఆపరేషన్ లో డబ్బు తీసుకుని ఫేక్ యూనిర్శిటీలలో అడ్మిషన్ తెప్పించి స్టూడెంట్ వీసా వచ్చేందుకు సహకరిస్తున్న ఎనిమిది మంది తెలుగు వాళ్ళ ముఠాని అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే.

వీళ్లవల్ల అడ్మిషన్ పొంది అమెరికాలో ఉండేందుకు స్టూడెంట్ వీసాను వాడుకుంటున్న (ఫే అండ్ స్టే) 130 మంది కూడా అరెస్టు చేశారు.అందులో 129 తెలుగువాళ్లే.వీళ్ల అరెస్టు పట్ల భారత ప్రభుత్వం నిరసన తెలిసింది. ఈ మేరకు నిరసన లేఖ (డిమార్స్) న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి పంపారు.

వారు విద్యార్థులని,బాధితులని వారిని అరెస్టయిన బ్రోకర్ల (రిక్రూటర్ల)తో సమానంగా చూడరాదని భారత్ అంటున్నది.

అయితే, ఈ రాకెట్ లో అరెస్టయిన 129 మంది తెలుగు వారికి తాము చేస్తున్నది చట్టవ్యతిరేకమని తెలుసునని, ఉద్దేశపూర్వకంగా ఈ నేరానికి వారు పాల్పడ్డారని అమెరికా అంటున్నది. ‘‘ఫార్మింగ్‌టన్‌ విశ్వవిద్యాలయం ఉనికిలోనే లేదు. లెక్చరర్లు ఉండరు, క్లాసులుండవు. ఈ విషయం వారికి ముందే తెలుసు. ఆన్‌లైన్‌లో గానీ, వ్యక్తిగతంగా కానీ ఎలాంటి క్లాసులకూ హాజరవ్వాల్సిన పనిలేదని వారికి తెలుసు. ఈ విషయం ఆ వర్సిటీ వెబ్‌సైట్లో రాసే ఉంది. అయినప్పటికీ చేరిపోవాలని నిర్ణయించారు. కారణం చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉండిపోవాలనేది వారి ఉద్దేశం. అందువల్లే ఫేక్ యూనవర్శిటీ అయినా చేరారు,’అని అమెరికా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

 ఒకరికి బెయిల్

పోతే, ఫార్మింగ్‌టన్‌ విశ్వవిద్యాలయంలో విద్యార్థులను చేర్పించే కుంభకోణంలో అరెస్టయిన ఎనిమిది మంది బ్రోకర్లు (రిక్రూటర్లు) మంగళవారం నాడు మిచిగన్‌ కోర్టులో హాజరుపరిచారు. తాము నిర్దోషులమని వారంతా విన్నవించారు. అందులో ఒకరైన కర్నాటి ఫణిదీ్‌పకు కోర్టు బెయిలు మంజూరు చేసింది. అతగాడు 10వేల డాలర్ల పూచీకత్తుపై బెయిల్‌ పై బయటపడ్డారు. మిగిలిన ఏడుగురు- కాకిరెడ్డి భరత్‌, కందాళ సురేష్‌, ప్రేమ్‌ రాంపీస, సామ సంతోష్‌, తక్కళ్లపల్లి అవినాష్‌, నూనె అశ్వంత్‌, ప్రత్తిపాటి నవీన్‌లు నిర్బంధంలోనే ఉండిపోయేందుకు అంగీకరించారు. నేరం రుజువైతే దాదాపు ఐదేళ్ల దాకా వీరికి జైలుశిక్ష పడే అవకాశం ఉంది.