జనవరి ఒకటో తేదీనుంచి కొన్ని రకాల డెబిట్, క్రెడిట్, నేషనల్, ఇంటర్నేషన్ కార్డులు చెల్లవు. రిజర్వు బ్యాంకు ఎపుడో 2015 లో ఇచ్చిన ఆదేశాల గడువు డిసెంబర్ 31 ముగుస్తున్నది. ఈ అదేశాల ప్రకారం కొత్త సెక్యూరిటీ ఫీచర్స్ తో ఉన్న కార్డులు పొంది వుండాలి. అలా కాకుండా నడుస్తున్నది కదా బద్దకింది, మీరింకా పాతకార్డుతోనే ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటే ఫసక్, మీకార్డు ను ఎటిఎం తిరస్కరిస్తాయి. అందువల్ల మీ కార్డు రిజర్వు బ్యాంక్ బ్యాన్ చేసిన కార్డుల్లో ఉందా ? వెంటనే చెక్ చేసుకోండి.
ఇంతకీ సంగతి ఏంటంటే, కార్డులతో వ్యాపారం చేస్తున్నపుడు వ్యాపారస్థులను మోసం చేయకుండా ఉండేందుకు కొత్త రకం ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 27,2015 న రిజర్వు బ్యాంక్ ఒక ఉత్తర్వు జారీ చేసింది. దీని ప్రకారం సెప్టెంబర్ 1, 2015 నుంచి ప్రతికార్డులో ఇఎంవి (EMV) చిప్ తో ఉండాలి. అదే విధంగా PIN అధార కార్డు అయి ఉండాలి.
EMV చిప్ అంటే ఏమిటో కాదు, EuroPay, MasterCard and Visa (EMV) చిప్. దీనికి తోడు పిన్ నెంబర్ ఉండాలి. ఈ రెండు ఉన్న కార్డులను క్లోన్ చేయడం కష్టం. దొంగకార్డులను ఉపయోగించి ఎక్కడా మోసం చేయకుండా ఉండేందుకు ఇఎంవి సపోర్టు ఉన్న కార్డులను ఖాతాదారులకు సప్లయి చేయాలని బ్యాంక్ నియమం పెట్టింది మూడేళ్ల గడువు కూడా ఇచ్చింది. అది డిసెంబర్ 31న ముగుస్తుంది.
EMV చిప్ కార్డు మీద ఎడమ వైపు బంగారు రంగులో మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పటికే బ్యాంకులు ఈరకం కార్డులను అందరికి అందించాయి.అయితే, ఒక వేళ ఎవరైనా కార్డు మార్చకోకుండా పాతకార్డునే వాడుతూ ఉంటే వాళ్ల కాార్డులు జనవరి ఒకటో తేదీనుంచి బ్యాన్ అవుతాయి.
అయితే, దీని గురించి భయపడాాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, పాత కార్డులను వాపసుచేసి కొత్త కార్డులను తీసుకునేందుకు ఇంకా నెలరోజులు గడువుంది. వెంటనే మార్చుకోండి.