హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఖంగుతిన్న సంఘటన ఒకటి జరిగింది. హైదరాబాద్ లోని నారాయణగూడ పోలీసులకు ఈ విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఆ పూర్తి వివరాలు చదవండి కింద వీడియోలు ఉన్నాయి చూడండి.
నారాయణగూడలో ఒక ద్విచక్ర వాహనం పై జస్ట్ 135 చలానాలు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. వాటి ఫైన్ విలువ కేవలం 31,455 రూపాయలు మాత్రమే. ఎప్పటి నుంచో ఆ బైక్ మీద చలానాలు కట్టకుండా బైక్ ఓనర్ కృష్ణ ప్రకాష్ లైట్ తీసుకుంటున్నాడు.
ఈ చలానాలు కట్టే బదులు ఆ డబ్బు పెట్టుకుంటే ఇంకో బైక్ తీసుకోవచ్చన్న ఆలోచనతో ఉన్నాడో లేక మరేదైనా కారణముందో తెలియదు కానీ అడ్డగోలు కొట్టుడు కొట్టిండు. దీంతో చలానాల మోత మోగించాయి పోలీసు కెమెరాలు. ఈ బైక్ హీరో హోండా గ్లామర్ గా చెబుతున్నారు. బైక్ నెంబరు Ts10ED 9176
అయితే ఆ బైక్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు సదరు ఓనర్ మీద కేసు ఫైల్ చేశారు. ఇలాంటి డేంజర్ జర్నీ చేయడం బైక్ ఓనర్ కే కాదు మిగతా వారికి కూడా నష్టం అని పోలీసులు అంటున్నారు. ఇటువంటి ిసిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయడం ద్వారా సమాజానికి నష్టం తప్పదని వారు చెప్పారు.
చలానాల లిస్టు ఎంత పెద్దగా ఉందో కింద వీడియో చూడండి.