ఉత్తరప్రదేశ్ లో దారుణం.. అత్యాచార బాధితురాలిని కిడ్నాప్ చేసిన దుండుగులు..!

ప్రస్తుత కాలంలో మహిళలకు రక్షణ కరువైంది. చిన్నపిల్లలు యువతలు ముసలివారు అని తేడా లేకుండా వారి మీద అత్యాచారానికి పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. చాలామంది పురుషులు మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తూ వారిని బెదిరించి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్ లో కూడా ఇటువంటి దారుణ ఘటన చోటు చేసుకుంది. తనమీద అత్యాచారం జరిగిందని ఆరోపించిన బాధితురాలిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటన ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లో కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే…ఉత్తరప్రదేశ్‌లోని తిల్హర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తి తీవల ఒక ఉపాధ్యాయురాలిని నమ్మించి తనతో పని ఉందని చెప్పి ఆ ఉపాధ్యాయురాలిని షాజహాన్‌పూర్‌కు తీసుకెళ్లి అక్కడ హోటల్‌లో ఆమె మీద అత్యాచారానికి పాల్పడినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (రూరల్) సంజీవ్ బాజ్‌పాయ్ వెల్లడించారు. అయితే అత్యాచారం చేస్తున్న సమయంలో ఆ నిందితుడు ఆమెను వీడియో తీసి ఈ విషయం బయట పెడితే కుటుంబ సభ్యులను చంపేస్తానని ఆ వీడియో కూడా సామాజిక మాధ్యమాలలో పెడతానంటూ ఆ మహిళను బెదిరించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే మొదట భయపడిన ఆ మహిళ తర్వాత ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు ఆ నిందితుడు ఇంటికి వెళ్లారు.

రెండు రోజుల క్రితం జరిగిన విషయాన్ని మహిళ కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు ఆ వ్యక్తి ఇంటికి వెళ్లారు. అయినా బెదిరించి వెనక్కి పంపారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న నిందితులు సదరు మహిళను బుధవారం రాత్రి పోలీసులు ఈ ఫిర్యాదు పై కేసు నమోదు చేసినట్లు సమాచారం . సదరు బాధితురాలిని ఆ నిందితుడు ఆమె ఇంట్లోనుంచే కిడ్నాప్‌ చేసినట్టు ఎస్పీ తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు గాలింపు చేపట్టారు. పలు సెక్షన్ల కింద బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు.