సినిమా స్టైల్ లో ఢీకొన్న రెండు డబుల్ డెక్కర్ బస్సులు!

దేశంలో ప్రతిరోజు ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వాహనాలు మితిమీరిన వేగంతో నడపటం వల్ల ప్రతిరోజు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.తాజాగా ఉత్తరప్రదేశ్ లో భారీ రోడ్డు ప్రమాదం చోటచేసుకుంది. రెండు డబుల్ డెక్కర్ బస్సులు ఢీ కొనడంతో భారీ స్థాయిలో ప్రమాదం జరిగింది. వివరాలలోకి వెళితే… దేశంలో అతి పొడవైన రహదారుల్లో ఒకటైన పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ ‌ హైవే పై ఈ ఘోర ప్రమాదం చోటచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 8 మంది మరణించగా ఎంతో మంది తీవ్ర గాయాలపాలయ్యారు.

దేశంలో అతి పొడవైన రహదారుల్లో ఒకటైన పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌ వే 341 కిలోమీటర్ల పొడవుతో దాదాపు 10 జిల్లాలను కలుపుతూపోతుంది. తాజాగా బారాబంకి జిల్లాలో లోని కత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే నారాయణ్ పూర్ గ్రామం వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెళ్తున్న రెండు డబుల్ డెక్కర్ బస్సులు నారాయణ్ పూర్ గ్రామం వద్ద సోమవారం తెల్లవారుజామున ఒకదానితో ఒకటి ఢీకొట్టడంతో భారీ స్థాయిలో ప్రమాదం జరిగి అక్కడికక్కడే 8 మంది ప్రయాణికులు మరణించారు. అంతేకాకుండా ఈ ప్రమాదంలో చాలామంది తీవ్రగాయాల పాలయ్యారు.

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను వెలికి తీసి వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కొందరి ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదం జరగడానికి గల కారణాల గురించి దర్యాప్తు మొదలుపెట్టారు.