సైదాబాద్ లో సైకోల వీరంగం (ఎక్స్ క్లూజివ్ వీడియో)

 

సైదాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నడిరోడ్డుపైన సైకోలు వీరంగం సృష్టించారు. జనసంచారం ఉన్న సమయంలోనే వారు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఓ ఆటో డ్రైవర్ పై నలుగురు వ్యక్తులు రాళ్లతో, కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం మాదన్న పేట్ కి చెందిన అర్జున్ వృత్తి రీత్యా ఆటో డ్రైవర్. ఆదివారం తన స్నేహితులైన విజయ్, ప్రసాద్ లను సింగరేణిలో దింపటానికి ఆటో లో వెళ్లారు. దింపి తిరిగి వస్తుండగా విజయ్ ని కొందరు యువకులు దాడి చేశారు. తన స్నేహహితున్ని కాపాడటానికి అర్జున్ వెళ్లడంతో అతని పై కూడా రాళ్లతో, కర్రలతో ఇష్టానుసారంగా కొట్టారు.

తీవ్ర గాయాలైన అర్జున్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు అర్జున్ ను ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. సి సి కెమెరా ల ద్వారా పోలీసులు సింగరేణి కాలనీకి చెందిన లక్ష్మణ్, గోపి, మహేష్, పవన్ లుగా గుర్తించి అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వీడియో కింద ఉంది చూడండి.

https://www.youtube.com/watch?v=KrL6ii-pSZA&feature=youtu.be