స్టూడెంట్ ను గర్భవతిని చేసిన ప్రిన్సిపాల్

ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. విద్యాబుద్దులు నేర్పాల్సిన ప్రిన్సిపాల్ కామాంధుడిగా మారాడు. మార్కులు వేస్తానని చెప్పి పదో తరగతి అమ్మాయిని లోబర్చుకొని గర్భవతిని చేశాడు. ఈ దారుణ సంఘటన ప్రకాశం జిల్లా ఇంకొల్లులో జరిగింది.

ప్రకాశం జిల్లా ఇంకొల్లులోని ఎంఆర్ ఆర్ ప్రైవేటు స్కూల్ లో బాలిక 10 వ తరగతి చదువుతోంది. పాఠశాల ప్రిన్సిపాల్ గా  వీరయ్య పని చేస్తున్నారు. బాలిక పై కన్నేసిన వీరయ్య ప్రాక్టికల్స్ లో మార్కులు ఎక్కువ వేస్తానని ఆశపెట్టి బాలికను లొంగదీసుకున్నాడు. రాత్రి ట్యూషన్లలలో బాలిక పై అత్యాచారం చేసేవాడని తెలుస్తోంది. దీంతో బాలిక గర్భం దాల్చింది. ఇటీవల వీరయ్య బాలికను లైంగికంగా వేధించడంతోపాటు శారీరకంగా హింసించడంతో విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు స్కూలు ముందు ఆందోళనకు దిగాయి.  తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరయ్య ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.