పెద్దలు అన్నది కరెక్టే.. ఆలుమగల పంచాయతీల మధ్యల పోవద్దని తెలుగు రాష్ట్రాలలో వెనుకటి నుంచి సామెత ఉంది. అది అక్షరాల నిజం చేస్తూ అటువంటి సంఘటనే మల్కాజ్ గిరి లో జరిగింది. చివరకు వారి గొడవ ఆ పోలీసు ఉద్యోగానికే ఎసరు పెట్టింది.
మల్కాజ్ గిరి సీఐ కొమురయ్య పై సస్పెన్షన్ వేటు పడింది. న్యాయం చేయాల్సిన పోలీసులే సెటిల్మెంట్ పేరుతో పైసలు లాగేస్తున్నారు. ఈ ఉదంతం బయట పడటంతో విచారించిన సీపీ మల్కాజ్ గిరి సీఐ పై సస్పెన్షన్ వేటు వేశారు. ఇంతకీ ఆ సీఐ కథేంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.
మల్కాజ్ గిరికి చెందిన దంపతుల మధ్య వివాదాలు తలెత్తాయి. దీంతో వారు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వీరి వివాదాన్ని సెట్ చేస్తానని చెప్పి సీఐ కొమురయ్య భార్య కు తెలియకుండా భర్త దగ్గర లక్ష రూపాయలు, భర్తకు తెలియకుండా భార్య దగ్గర లక్ష రూపాయలు తీసుకున్నాడు. పంచాయతీ తెంపలేదు. ఇంతలో భార్యభర్తలు ఒక్కటయ్యారు. పోలీసు సారుకు లక్ష ఇచ్చిన అంటే నేను లక్ష ఇచ్చిన అని అనుకుర్రు. అర్రె పోలీసు సారు గిట్ట మోసం చేస్తాడా అని పోలీసు కమీషనర్ కి ఫిర్యాదు చేశారు. విచారించిన కమీషనర్ సార్ ఇది నిజంగానే జరిగిందని తెలుసుకొని సీఐ కొమురయ్యను సస్పెన్షన్ చేశారు.