పంజాగుట్టలో ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రశాంత్ కేసు పలు మలుపులు తిరుగుతోంది. తన మృతికి భార్య పావనినే కారణమంటూ ప్రశాంత్ సూసైడ్ లెటర్ రాసి చనిపోయాడు. దీంతో పావనిని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. బెయిల్ పై విడుదల అయిన పావని ఇటీవల ఓ టివి షోలో పలు విషయాలను వెల్లడించింది.
కామారెడ్డి జిల్లాకు చెందిన తిరునగరి ప్రశాంత్ సిలికాన్ ఇమేజ్ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతను ఐఐటి ఖరగ్ పూర్ లో టాప్ స్టూడెంట్. ఇతనికి 2014 లో వరంగల్ జిల్లాకు చెందిన పావనితో వివాహం జరిగింది. వీరు పంజాగుట్ట శ్రీనగర్ కాలనీలో పద్మజ మెన్షన్ అపార్ట్ మెంట్ లో నివాసం ఉండేవారు.
పావనికి ప్రణయ్ అనే యువకుడు పరిచయం కావడంతో వారి పరిచయం వివాహేతర సంబందానికి దారి తీసిందని, ఈ విషయం పై పావనిని హెచ్చరించినా కూడా తనలో మార్పు రాలేదని ప్రశాంత్ లేఖలో రాశాడు. తన భార్యను మార్చలేకే తాను చనిపోతున్నానని ప్రశాంత్ సూసైడ్ లెటర్ లో రాశాడు. ప్రశాంత్ లేఖ ఆధారంగా పావని పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఇటీవల బెయిల్ పై వచ్చిన పావని పలు విషయాలను తెలిపింది. అవి ఆమె మాటల్లోనే…
“మా పెళ్లి 2014లో జరిగింది. పెళ్లి సమయంలో నేను కూడా జాబ్ చేసేదాన్ని. ప్రశాంత్ తో తన జీవితం బాగానే ఉండేది. కానీ పెళ్లి అయిన సంవత్సరం తర్వాత నుంచి ప్రశాంత్ లో మార్పు గమనించాను. ప్రతి చిన్న విషయానికి గొడవ పడేవాడు. ప్రణయ్ అనే యువకుడితో తనకు సంబంధాలు ఉన్నాయంటూ కథనాలు వస్తున్నాయి. వాస్తవానికి ప్రణయ్ పెళ్లికి ముందే పరిచయం. అతను క్లాస్ మేట్. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ అందరితో కలుసుకునేవాళ్లం. బయటికి వెళ్లే వాళ్లం. అంతే తప్ప ఏ రోజు కూడా నేను ప్రణయ్ తో ఒంటరిగా వెళ్లలేదు. అతను కేవలం తనకు స్నేహితుడు మాత్రమే తప్ప అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదు. అసలు ప్రశాంత్ కు, ప్రణయ్ కి సంబంధమే లేదు. కానీ ప్రశాంత్ ఫ్రెండ్ ప్రణయ్ అని వార్తల్లో వచ్చింది. అది నిజం కాదు.
ప్రశాంత్ పెళ్లైన సంవత్సరం తర్వాత నుంచి చాలా మారిపోయాడు. ఇంట్లో కూడా కనీస అవసరాలను గుర్తించేవాడు కాదు. ఇంటికి ఎప్పుడైన డాడీ వాళ్లు వచ్చిన కూడా సరిగా చూసుకునేవారు కాదు. మాట్లాడకపోయేది. కనీస మర్యాదల గురించి కూడా ప్రశాంత్ పట్టించుకోలేదు. ఒక్కో సారి ఇంట్లో తినడానికి బియ్యం కూడా ఉండేవి కావు. ప్రశాంత్ జీతం నెలకు 2 లక్షల రూపాయలు. ఎప్పుడు చూడు పని పని అని బిజీగా ఉండేవాడు.
ఎవరికి ఫోన్ చేసినా అనుమానించేవాడు. చివరికి తన తమ్ముడితో మాట్లాడినా కూడా అనుమానించాడు. నేను ఒక్కదాన్ని ఒంటరిగా బయటికి వెళితే లోకేషన్ సెండ్ చేయమనేవాడు. ఇలా అనేక రకాలుగా ప్రశాంత్ తనను ఇబ్బంది పెట్టాడు”. అని పావని ఇంటర్వ్యూలో తెలిపింది. పావని ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో కింద ఉంది చూడండి.
https://www.youtube.com/watch?v=wqg7MU3LXGk