నిజాం మ్యూజియం చోరి కేసును చేధించిన పోలీసులు

నిజాం మ్యూజియంలో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. అత్యంత విలువైన బంగారు టిఫిన్ బాక్స్, టీ కప్పు, సాసర్, బంగారు చెంచాను ఎత్తుకెళ్లిన ఇద్దరు దొంగలు పట్టుబడ్డారు.  ఈ దొంగలు ముంబైలోని ఓ రహస్య ప్రాంతంలో ఉండగా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు.

దొంగల నుంచి టిఫిన్ బాక్స్ సహా మిగిలిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. పట్టుబడిన ఇద్దరు యువకులు హైదరాబాద్ కు చెందిన వారిగా గుర్తించారు. అరెస్టు వివరాలను పోలీసులు మంగళవారం మీడియా సమావేశంలో అధికారికంగా వెల్లడించనున్నారు.