ఈ పోలీసులు వొల్లు మరచి డ్యాన్స్ చేశారు (వీడియో)

కనిపించే మూడు సింహాలు, నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే.. కనిపించని నాలుగో సింహమేరా ఈ పోలీస్ అని సాయికుమార్ డైలాగ్ ఎప్పుడో కొట్టిన డైలాగ్ ఇప్పటి వరకు జనాల మదిలో నానుతూనే ఉన్నది.

పోలీసోడు ట్రాన్స్ ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కే పోతాడు.. పోస్టాపీస్ కు కాదు అనే రవితేజ సినిమాలోని డైలాగ్ కూడా బాగా పాపులర్ అయింది.

ఈ డైలాగును బట్టి మనకు తెలియాల్సింది ఏమంటే అందరు మనుషుల్లా పోలీసులు ఉండలేరు.. ఉండకూడదు అని. వాళ్లకు బరువు బాధ్యతలు చాలా ఎక్కువే అప్పగించింది సమాజం. అందుకే పోలీసులు ఆదమరచి ఉండరు. ఆర్మీ సిబ్బందితో సమానంగా పోలీసులు కూడా స్ట్రిక్ట్ గా ఉంటారు.

కానీ సంగారెడ్డి పోలీసులు మాత్రం ఆ రూల్స్ అన్నీ మాకేం లేవు అనుకున్నట్లున్నారు. అందుకే గణేష్ నిమజ్జనం వేళ శోభాయాత్రలో రెచ్చిపోయారు. గణేష్ భక్తులను పక్కకు నెట్టేసి యూనిఫామ్ వొంటి మీద ఉందన్న సోయి లేకుండా చిందులేశారు. శోభాయాత్రలో భక్తుల కంటే ఎక్కవ పోలీసులే డ్యాన్స్ చేసి దుమ్ము రేపారు. ఒంటిపై ఉన్న యూనిఫామ్ మీద రంగులు చల్లుకున్నారు. 

ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. యూనిఫామ్ మీద ఉండి ఎందుకు డ్యాన్స్ చేశారన్నదానిపై విచారణ మొదలు పెట్టారు. విచారణ నివేదిక వచ్చిన తర్వాత డ్యాన్స్ చేసిన పోలీసుల మీద చర్యలు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. డ్యాన్స్ చేసిన వారిలో ఒకరు సిద్దిపేట ట్రాఫిక్ డిఎస్పి బాలాజీ, ఇంకొకరు మెదక్ డిఎస్పి ఉన్నారు.

వీరిద్దరూ ఉన్నతాధికారులు కాగా వీరితోపాటు మెదక్ రూరల్ సిఐ రామకృష్ణ, మెదక్ టౌన్ సిఐ విజయ్ కుమార్, ఎస్సై శేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు. పెద్ద సార్లు శెంగ శెంగ ఎగురుతుంటే చూసి తట్టుకోలేక కానిస్టేబుళ్లు కూడా ఎగిరిర్రు. 

మెదక్ పోలీసుల చిందులపై ఉన్నతాధికారులు సీరియస్ కావడంతో డ్యాన్స్ చేసిన పోలీసులు టెన్షన్ పడుతున్నారు. పోలీసుల డ్యాన్స్ వీడియో కింద ఉంది చూడండి. 

sangareddy police dance