రైలు కిందపడి ఇలా బతికొచ్చాడు… (వీడియో)

భూమ్మీద నూకలు ఉండాలే గానీ..రైలు చక్రాలు అమాంతం దూసుకొచ్చి..తల దగ్గరకు వచ్చి ఆగిపోయేలా చేస్తాయ్. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసిన ఈ ప్రమాదం హైటెక్ సిటీ స్టేషన్ వద్ద చోటుచేసుకుంది.ట్రాక్ దాటే అతన్ని రైలు ఢీకొంది. కొద్ది దూరం ట్రాక్ పై ఈడ్చుకెళ్లింది. రైలు చక్రాలు తల దగ్గరికి వచ్చి ఆగిపోయాయ్.

రైలు డ్రైవర్ సమయ స్పూర్తితో..క్షణాల్లో ప్రాణాపాయం నుంచి ఓ వ్యక్తి బయటపడ్డాడు. రైలును కొంచెం వెనక్కి పోనించి రైలు కింద ఉన్న అతన్ని కాపాడారు. రైలు అతన్ని ట్రాక్ పైకి ఈడ్చుకెళ్లాడాన్ని గమనించిన ప్రయాణీకులు, జనం రైలు డ్రైవర్ని అప్రమత్తం చేశారు. రైలొచ్చే లోపు ట్రాక్ దాటి వెళ్ళిపోవడం ఎంత ప్రాణాపాయమో ..ఈ ఘటన మరోసారి వెల్లడిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో కింద ఉంది చూడండి.