గణేష్ నిమజ్జనంలో అపశృతి, తెగిన క్రేన్ తీగ (వీడియో)

గణేష్ నిమజ్జనం వేళ కరీంనగర్ జిల్లాలో అపశృతి నెలకొంది. మట్టి గణపయ్యను నవరాత్రులు పూజించుకున్న భక్తులు నిమజ్జనానికి తరలించారు. ఆ సమయంలో నిమజ్జనం చేసే వేళ భారీ క్రేన్ కు ఉండే తీగ తెగిపోయింది. దీంతో భక్తులు ఒక్కసారిగా నీటిలో పడిపోయారు. 

కరీంనగర్ జిల్లా, జమ్మికుంటలోని నాయిని చెరువులో నిమజ్జనం చేస్తుండగా వైర్ తెగిపోయింది. దీంతో వెంటనే గణపయ్య సహా ముగ్గురు యువకులు నీటిలో పడిపోయారు. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు చెరువులోకి దిగి ముగ్గురిని రక్షించారు.  దీంతో ఎలాంటి ప్రాణ హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

క్రేన్ కు వాడిన కేబుల్ పురాతనమైనది కావడంతో ముగ్గురిని ఆపలేక తెగిపోయింది. అయితే ఈ ప్రమాదంలో నీటిలో పడిపోయిన ముగ్గురికి స్థానికంగా ప్రాథమిక చికిత్స చేశారు. వారిలో ఒకిరికి స్వల్ప గాయాలయ్యాయి. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డట్లు చెబుతున్నారు. వారిని వరంగల్ లోని ఎంజిఎం కు తరలించారు. వారికి ప్రస్తుతం వైద్యం కొనసాగుతున్నది. వీడియో కింద ఉంది చూడండి.