నిజామాబాద్ జిల్లాలో చిరుత సంచారం, భయం భయం (వీడియో)

చిరుతపులి సంచరిస్తూ హల్ చేస్తుండడంతో నిజామాబాద్ జిల్లాలోని మాక్లూర్ మండలంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పూర్తి వివరాలు, వీడియో కింద ఉన్నాయి.

నిజామాబాద్ జిల్లాలోని మాక్లూర్ మండలం ఆడవి మామిడిపల్లి గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కంచేలో ఇరుక్కుపోయింది చిరుత పులి. 8 గంటల పాటు కంచేలో ఇరుక్కుని అవస్తలు పడుతున్న చిరుత పులిని చూసి స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వచ్చి చిరుతను పట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి. 

చివరకు అటవీశాఖ అధికారులు చిరుతకు మత్తు మందు ఇచ్చి పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈలోగా కంచెలోంచి బయటపడ్డ చిరుత అక్కడి నుంచి పరారైంది.  దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. 

చిరుత అడవిలోకి వెళ్లిపోయిందా? లేదంటే గ్రామ పరిసరాల్లోనే దాక్కుందా అన్న భయంతో గ్రామస్తులు కలవరపడుతున్నారు.

చిరుత వీడియో కింద ఉంది చూడండి.