బిగ్ బాస్ షో పై సీబీఐ మాజీ జేడి కామెంట్స్

బిగ్ బాస్ షో పై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కామెంట్స్ చేశారు. దేశానికి ఉపయోగపడే యువత దేశానికి అవసరమయ్యే విధంగా తయారవ్వాలంటే కొన్ని నియమాలు పాటించాలన్నారు. టివిలో వస్తున్న బిగ్ బాస్ షో చూడటానికి యువత ప్రతిరోజు రెండు గంటల సమయం వేస్టు చేసుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ షో బిగ్ బాస్ చెప్పినట్టు నడుస్తుందని, బిగ్ బాస్ అందరిని కంట్రోల్ చేస్తాడు కానీ బిగ్ బాస్ ను ఎవ్వరూ కంట్రోల్ చేయరని అన్నారు. శరీరాన్ని ఫిట్ గా ఉంచుకొని, మీ మెదడును మీ కంట్రోల్ లో ఉంచుకోవాలని యువతకు సూచించారు. స్వామి వివేకానంద చెప్పినట్టు మన శ్వాసను మన కంట్రల్ లో ఉంచుకోగలిగితే మన మైండ్ మన కంట్రోల్ లో ఉంటుందని చెప్పారు. ప్రాణయామం చేయడం ద్వారా దీన్ని సాధించవచ్చని తెలిపారు.