డబ్బు కోసం నీచానికి పాల్పడిన దుర్మార్గులు… ఏం చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ప్రస్తుతం దేశంలో చాలామంది కష్టపడి పని చేయడానికి బరువై సులువైన మార్గంలో డబ్బు సంపాదించడానికి అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ క్రమంలో ఏమాత్రం కష్టపడకుండా డబ్బు సంపాదించాలని దారుణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లో ఇటువంటి దారుణ ఘటన చోటు చేసుకుంది. డబ్బు కోసం మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన దుర్మార్గులు ఆ తర్వాత ఆమె మీద అత్యాచారం చేసి బ్రతికుండగానే గంగా నదిలో విసిరేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే…ఉత్తరప్రదేశ్‌ లోని కాన్పూర్‌లోని మైకుపూర్వా పరిధికి చెందిన ఓ వ్యక్తి.. తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. సదరు వ్యక్తి డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదిలావుండగా ఇటీవల సాయంత్రం ఆడుకోవడానికి బయటకు వెళ్లిన అతని పదేళ్ల కుమార్తె చీకటి పడిన తర్వాత కూడా ఇంటికి రాకపోవడంతో ఆ తల్లిదండ్రులు కంగారు పడ్డారు. తమ కూతురి కోసం చుట్టుపక్కన ఉన్న ప్రాంతాలలో వెతికారు. కానీ వారికి కూతురు గురించి ఎటువంటి ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో రాత్రి 9 గంటల సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి బాలిక తండ్రికి ఫోన్ చేసి మీ కూతురు మా వద్దే ఉంది అర్జెంటుగా ఆరు లక్షల డబ్బు ఇచ్చి మీ కూతుర్ని తీసుకెళ్లండి అంటూ హెచ్చరించారు.

అయితే తాను ఒక సాధారణ డ్రైవర్ నని, అంత డబ్బు తన వద్ద లేదని, దయచేసి తమ కూతురిని వదిలిపెట్టాలని వేడుకున్నాడు. దీంతో ఆ దుర్మార్గులు బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడి తర్వాత బాలిక బ్రతికుండగానే గంగానదిలో పడేసి వెళ్లిపోయారు. అయితే బాలిక తండ్రి ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు చిన్నారి కోసం గంగా నదిలో గాలింపు చర్యలు మొదలుపెట్టారు. చిన్నారిని కిడ్నాప్ చేసింది అదే ప్రాంతానికి చెందిన నలుగురు యువకులని రుజువు కావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.