స్కూల్లో మహిళతో హెడ్ మాస్టర్ రాసలీలలు

పాఠశాలను సరస్వతి నిలయాలుగా భావిస్తాం. ఉపాధ్యాయులను గౌరవిస్తాం. వారిద్దరు విద్యార్ధులకు పాఠాలు చెప్పాల్సిన టిచర్లు. వారు వక్రబుద్దితో ఏకంగా పాఠశాలలోనే రాసలీలకు తెరలేపారు. ఆదివారం పూట స్పెషల్ క్లాసులు అని చెప్పి పాఠశాలలోనే ఓ మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇంతకీ పూర్తి వివరాలు ఏంటంటే..

తమిళనాడులోని నాగర్ కోయిల్ సమీపంలోని  ఓ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉంది. ఇక్కడ సుదాంగన్ అనే వ్యక్తి హెడ్మాస్టర్ గా పని చేస్తున్నారు. అదే పాఠశాలలో సుబ్బు అనే ఉపాధ్యాయుడు కూడా పని చేస్తున్నారు. వీరిద్దరు చాలా మంచి స్నేహితులు. అయితే వీరిద్దరికి ఓ వివాహిత మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఎక్కడైనా అయితే బయటపడుతుందనుకున్నారో ఏమో కానీ ఏకంగా పాఠశాలలోనే రాసలీలకు పాల్పడ్డారు.

ఆదివారం నాడు ప్రత్యేక తరగతులు ఉన్నాయని ఇంట్లో చెప్పి వీరిద్దరు వచ్చే సమయంలో ఓ మహిళను కూడా తమ వెంట తీసుకొచ్చే వారు. ఆ తర్వాత మహిళను తీసుకొని ఒకరు గదిలోకి వెళితే మరొకరు గది బయట తాళం వేసి కాపలా ఉండేవారు. ఆ మహిళతో ఒకరు రాసలీలలు ముగించిన తర్వాత మరొకరు వెళ్లేవారు. ఇలా గత కొంత కాలంగా జరుగుతోంది. ఈ తంతు జరిగేటప్పుడు స్కూల్ ఆవరణలోకి కూడా ఎవరిని రానిచ్చే వారు కాదు.

అయితే తాజాగా ఆదివారం కూడా వారు మహిళను తీసుకొని పాఠశాలకు వచ్చారు. ఈ సారి మహిళ తనతో పాటు తన నాలుగేళ్ల కొడుకుని కూడా తీసుకొచ్చింది. ముందుగా హెడ్మాస్టర్ సుదాంగన్ మహిళను తీసుకొని రూములోకి వెళ్లాడు. మహిళ కొడుకుని సుబ్బు పట్టకొని రూము బయట తాళం వేశాడు. గంట సేపు అవుతున్న మహిళ కనిపించకపోవడంతో ఆ బాలుడు అమ్మ.. కావాలి అంటూ ఏడుపు స్టాట్ చేశాడు. సుబ్బుకు ఆ బాలుడిని ఆపడం చేతకాలేదు.

బాలుడి ఏడుపు విన్న చుట్టు పక్క వారు వచ్చి అడగగా సుబ్బు తలతిక్క సమాధానాలు చెప్పాడు. బాలుడిని సుబ్బు కిడ్నాప్ చేశాడని అంతా భావించారు. కానీ ఆ బాలుడు అమ్మ ఈ రూములో ఉందంటూ వారికి చూపించాడు. అప్పుడు సుబ్బును గ్రామస్థులు నిలదీయగా భయంతో తాళం తీశాడు. ఆ రూములో సుదాంగన్, మహిళ రాసలీలల్లో మునిగి ఉండటాన్ని చూసి గ్రామస్థులు షాకయ్యారు. గ్రామస్థులు వచ్చేలోపు వారు దుస్తులు లేకుండా నగ్నంగా ఉన్నారు. పిల్లవాడి ఏడుపులు వినిపించడం లేదా.. సిగ్గులేకుండా సరసాలు ఆడుతున్నారు అంటూ అక్కడికి వచ్చిన మహిళలు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్థులను చూసిన మహిళ, హెడ్మాస్టర్ పరుగులు తీసే ప్రయత్నం చేయగా వారిని గ్రామస్థులు అడ్డుకొని నిలదీసి అడిగారు. 

దీని పై విద్యాశాఖాధికారులకు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. దీంతో హెడ్మాస్టర్ సుదాంగన్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సుబ్బు ను విచారించిన తర్వాత అతని పై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖాధికారులు తెలిపారు. బడిలోనే రాసలీలలు కొనసాగించడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీని పై విద్యార్ధి సంఘాలు నిరసనను వ్యక్తం చేశాయి. మళ్లీ ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలని వారు కోరారు.