ఫైవ్‌స్టార్ హోట‌లో, ఎయిర్‌పోర్టో కాదు..తిరుప‌తి రైల్వేస్టేష‌న్‌!

ఈ పిక్ చూస్తోంటే ఏ ఫైవ్‌స్టార్ హోట‌లో లేదా ఎయిర్‌పోర్ట్ ఇన్‌సైడ్‌కి సంబంధించిన‌దో అనిపిస్తోంది క‌దూ! కాదు. రైల్వేస్టేష‌న్‌లోనివి. అది కూడా మ‌న తిరుప‌తి రైల్వేస్టేష‌న్ లాంజ్‌కు సంబంధించిన పిక్ ఇది. `అతిథి` పేరుతో రైల్వే మంత్రిత్వ‌శాఖ కొత్త‌గా తిరుప‌తి రైల్వేస్టేష‌న్‌లో ప్రీమియ‌మ్ లాంజ్‌ల‌ను నిర్మించింది.

 

 

ఇదివ‌ర‌కే ఉన్న వెయిటింగ్ రూమ్‌ల‌ను ఆధునికీక‌రించ‌డంతో పాటు కొత్త‌గా మ‌రో రెండు గ‌దుల‌ను దీనికోసం అద‌నంగా నిర్మించింది. త్వ‌ర‌లోనే ప్రీమియ‌మ్ లాంజ్‌ల‌ను ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ ప్రారంభించ‌నున్నారు. మ్యాగ‌జైన్లు, మ‌సాజ్ ఛెయిర్లు, సెంట్ర‌లైజ్డ్ ఏసి వంటి వ‌సతుల‌ను ఇందులో క‌ల్పించారు.