ప్రస్తుత కాలంలో యువతీ యువకులు ప్రేమ పేరుతో మోసపోతున్నారు. అయితే కొంతమంది యువతి యువకులు వారు ప్రేమించిన వారి కోసం కుటుంబ సభ్యులను ఎదిరించి ఇంటి నుండి పారిపోయి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.మరి కొంతమంది మాత్రం ప్రేమించిన వారి కోసం కుటుంబ సభ్యుల మీద దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా విశాఖపట్నంలో ఇటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. తండ్రి సంపాదించిన డబ్బు , నగలు ప్రియుడికి దానం చేసిందని తెలిసిన తండ్రి ఆమెను ప్రశ్నించడంతో తండ్రిపై కత్తి తో దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది.
వివరాలలోకి వెళితే…విశాఖపట్టణం శంకరమఠం ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి క్యాటరింగ్ వ్యాపారం చేస్తూ కుమారుడు కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నాడు.కొంతకాలం క్రితం భార్య మరణించడంతో తన ఇద్దరు పిల్లలు భావిస్తూ వారి బాగోగులు చూసుకుంటూ జీవిస్తున్నాడు. బాధితుడి కుమార్తె కాలేజీలో తనతో పాటు చదువుతున్న ఒక యువకుడితో పరిచయం పెంచుకొని ప్రేమలో పడింది. ఆ యువకుడి మాయలో పడిన యువతి నిజంగానే అతను ప్రేమిస్తున్నాడని భావించింది. ఇదే అదనగా భావించిన యువకుడు పలుమార్లు ఆ యువతిని అవసరాల కోసం డబ్బు అడిగేవాడు. ఇలా ప్రియుడి అవసరాలు తీర్చడానికి అప్పుడప్పుడు ఇంట్లో ఉన్న డబ్బు నగలు తన ప్రియుడికి ఇచ్చింది.
అయితే ఇంట్లో ఉన్న డబ్బు నగలు ఒక్కొక్కటి కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన సదరు బాధితుడు కూతురిని నిలదీశాడు. ఆ తర్వాత తండ్రి నిలదీసిన విషయాన్ని యువతి తన ప్రియుడికి చెప్పగా
మీ నాన్నను ఎదో ఒకటి చేస్తే మనకు అడ్డు ఉండదు. ఆ తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటా అంటూ యువతి ని రెచ్చగొట్టాడు. ప్రియుడి మాటలు నమ్మిన యువతి తన తండ్రి అడ్డు తొలగించుకోవడానికి శుక్రవారం ఉదయం చాకుతో తండ్రి మెడపై వెనుక నుంచి పొడిచింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడటంతో స్థానికులు వెంటనే అతన్ని సమీపంలోని ఆస్పత్రిలో చేరి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని యువతని అదుపులోకి తీసుకున్నారు.