తండ్రిని చంపి ఇంటికి నిప్పు పెట్టిన కూతుర్లు..కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఇటీవల కాలంలో ఆస్తి గొడవలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆస్తుల కోసం తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అనే భేదాలు లేకుండా హత్య చేసే ఘటనలు కోకొల్లలు. ఇలాంటి దురదృష్టకర ఘటన తెలంగాణ లోని కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఒక వ్యక్తిని సొంత కుతుర్లే హత్య చేశారు.

వివరాల్లోకి వెళితే….. కొప్పుల ఆంజనేయులు అనే 75 ఏళ్ల వ్యక్తి స్థానికంగా నివాసం ఉంటున్నాడు. ఇంట్లో నిద్రిస్తున్న అతడి మీద ముగ్గురు కూతుళ్ళు, మనవడు భాను ప్రకాష్ దాడి చేశారు. అనంతరం కోపంతో ఇంటికి నిప్పు పెట్టారు. దెబ్బల కారణంగా కొన ఊపిరితో ఉన్న అతను మంటలలో సజీవదహనం అయ్యాడు. మంటలను గమనించిన స్థానికులు మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే ఆంజనేయులు మృతి చెందాడు.

స్థానికుల సమాచారం ప్రకారం, గత పది రోజులు ముందు ఆంజనేయులు తనకు సంబంధించిన ఒక ఎకరా పొలాన్ని పది లక్షలకు అమ్మాడు. అయితే ఆ డబ్బు తమకు ఇవ్వలేదు అనే కోపం తో ముగ్గురు కూతుళ్ళు, మనవడు భాను ప్రకాష్ కలిసి హత్య చేసి ఉంటారని వారు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న రాజంపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.