బిటెక్ చదివావ్, ఇదేం పాడు పనిరా కోటేశ్వరరావ్

విజయవాడ నగర శివారు ల్లో ఏటి యమ్ ల ముందు మాయమాటలు చెప్పి కార్డులని అపహరించే శివ కోటేశ్వరరావును విజయవాడ రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. అయితే, అతగాడి వివరాలు తెలిసి షాక్ తిన్నారు.

కోటేశ్వరరావు బీటెక్ చదివాడు. హైదరాబాద్ లో చక్కని సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.అయితే, దాంతో పాటు కోటేశ్వరరావుకు చెడువ్యసనాలకు భానిసయ్యాడు. అంతే, శివ కోటేశ్వరరావు కరుసై పోయాడు. ఉద్యోగం వూడింది. ఎటిఎమ్ దొంగతనాలు గిట్టుబాటవుతాయని భావించారు. మొదలుపెట్టాడు. అలా గుట్టుగా దొంగతనాలు చేసుకుంటూ బతకడం కష్టం కదా.

కార్డు ద్వారా డబ్బులు డ్రా చేయడానికి సాయం అడిగే వారీకి సాయం చేస్తున్నట్లు నటించి వారి పిన్ నెంబర్ తెలుసుకొని అనంతరం డబ్బులు ఊడ్చికెళ్ళిపోయో వాడు కోటేశ్వరరావు. ఆమధ్య నున్న, పాయికాపురం ప్రాంతాలలో పలు చోరికేసులు నమోదయ్యాయి. ఈ కేసుల వెనక కోటేశ్వరరావు ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. బీటెక్ చదివి చెడువ్యసనాలకు అలవాటు పడిన ఒక కోటేశ్వరరావు ఈ తరహా దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసులు వాసన పసిగట్టారు.  అనేరాకుల,  శివకోటేశ్వరావు కు మ్యాచ్ కుదిరింది.అంతే అతగాడిని వలపన్ని అదుపులోకి తీసుకున్నారు నున్న పోలీసులు. అతని దగ్గిర నుంచి రూ1.5 లక్షలు పైగా చోరీ సొత్తుని స్వాధీనం చేసుకున్నారు.