ట్రాక్టర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన బాలుడు.. శోకసంద్రంలో తల్లీ తండ్రులు?

దేశంలో వాహనాల సంఖ్య రోజురోజుకీ పెరగటం వల్ల రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలా రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి రోజూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు అనాధలుగా మారుతున్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోతుంటే మరికొంతమంది తీవ్ర గాయాల పాలై జీవితాంతం అవిటి వాళ్ళలా బ్రతకాల్సి వస్తోంది. ఈ రోడ్డు ప్రమాదాలను అరికట్టటానికి ప్రభుత్వాలు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా కూడా వాహనాల నడిపే వారి నిర్లక్ష్యం, అజాగ్రత్త కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇటువంటి సంఘటన ఒకటి చోటు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో 9 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.

వివరాల్లోకి వెళితే.. ఇటీవల నేరడిగొండ మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మండల కేంద్రంలో ట్రాక్టర్ వేగంగా వస్తు గుండాలే ప్రజ్వల్ అనే 9 ఏళ్ల బాలుడిని ఢీ కొట్టింది. స్థానికులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు. నవ మాసాలు మోసికని అల్లారుముద్దుగా పెంచుకున్న తమ గారాల కొడుకు కళ్ళముందే ఇలా ప్రాణాలు కోల్పోతుంటే ఆ చిన్నారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

బాలుడు మృతి చెందటంతో ఆ గ్రామంలో విషాయాలు అలుముకున్నాయి. కంటికి రెప్పలా కాపాడుకొని పెంచిన కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రుల బాధ వర్ణాతీతంగా మారింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానికులను విచారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ సమయంలో ట్రాక్టర్ నడుపుతున్న వ్యక్తి వివరాల గురించి, ట్రాక్టర్ యజమాని గురించి దర్యాప్తు చేపట్టారు.