బీహార్ లో దారుణం .. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం?

ప్రస్థుత కాలంలో మహిళలకు రక్షణ బాగా కరువైంది. మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు కొంతమంది మగాళ్లు వారి కామ వాంఛలు తీర్చుకోవటానికి మృంగాలుగా మారి చిన్న పిల్లలు, ముసలి వారు అని కనీకరం చూపకుండా వారి మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి దారుణాలకు అడ్డు కట్ట వేయడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోజు రోజుకి ఇలాంటి దారుణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల బీహార్‌లోని బక్సర్‌ జిల్లాలో ఇటువంటి దారుణ సంఘటన చోటు చేసుకుంది. మైనర్ బాలికను కిడ్నాప్‌ చేసి నాలుగు రోజులపాటు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన కలకలం రేపుతోంది.

వివరాలలోకి వెళితే…బీహార్‌లోని బక్సర్‌ జిల్లాకు చెందిన పదమూడేళ్ళ బాలిక వస్తువులు కోనుగోలు చేయటానికి ఇంటి నుండి బయటికి వచ్చింది. ఈ క్రమంలో వంటరిగా వెళ్తున్న బాలికను ఆగష్టు 16 వ తేదీన కిడ్నాప్ చేసి పాట్నాలో అద్దెకు ఒక ఇంట్లో బాలికను నిర్బంధించారు. బయటికీ వెళ్ళిన కూతురు ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడి ఆమె కోసం చుట్టుపక్కల ప్రదేశాలలో గాలించారు. అయినప్పటికీ ఆమె ఆచూకీ దొరకపోవడంతో తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పాట్నాలో బాలికను నిర్బంధించిన నిందితులు తమ స్నేహితులతో కలిసి మొత్తం ఆరు మంది బాలికపై నాలుగు రోజులపాటు అత్యాచారం చేశారు. ఈ క్రమంలో బాలిక ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఈడుమ్రాన్ రైల్వే స్టేషన్ వద్ద ఆమెను వదిలి వెళ్లిపోయారు. అతి కష్టం మీద బాలిక ఎట్టకేలకు తమ నివాసానికి చేరుకొని జరిగిన విషయం తల్లిదండ్రులకు వెల్లడించింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా శివమ్ సింగ్, సచిన్ సింగ్ అనే ఇద్దరు నిందితులను పోలిసులు అరెస్ట్‌ చేశారు. ఈ దారుణానికి పాల్పడ్డ మిగిలిన నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.