హైదరాబాద్ జిల్లా లో ఈనెల 11వ తేదీన ఓట్ల లెక్కింపుకు విస్తృత ఏర్పాట్లు చేశారు.
15 కేంద్రాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఓట్ల లెక్కింపు కేంద్రాలకు ఈవీఎంలను తరలించారు. సీసీ కెమెరాల నిఘాలో స్ట్రాంగ్ రూములలో వాటిని భద్రపరించారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ లకు మూడు అంచెల పటిష్ట భద్రత ఏర్పాటుచేశారు. ఈ ఏర్పాట్లను జహెచ్ ఎంసి కమిషనర్ దానకిశోర్ వెల్లడించారు. లెక్కింపు ఏర్పాట్ల వివరాలు:
ప్రతి లెక్కింపు కేంద్రంలో 14 టేబుల్ ల ఏర్పాటు.
రిటర్నింగ్ అధికారికి ప్రత్యేక టేబుల్.
ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు.
ఇప్పటికే లెక్కింపు సిబ్బందికి మందికి తొలివిడత శిక్షణ పూర్తి. రెండవ విడత శిక్షణ 10వ తేదీన.
లెక్కింపులో ముందుగా పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపు.
కౌంటింగ్ ఏజెంట్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులు. పాంటింగ్ ఏజెంట్లు సత్ప్రవర్తన కలవారై ఉండాలి.
ప్రతి టేబుల్ కు ఒక కౌంటింగ్ ఏజెంట్.
మొబైల్ ఫోన్లు, పేపర్ల ను కౌంటింగ్ హాల్లోకి అనుమతించరు.
మొదటి అరగంట లో పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపు ప్రారంభం. అరగంట తర్వాత ఈవీఎంల లోని ఓట్ల లెక్కింపు ప్రారంభం.
కౌంటింగ్ పూర్తి అనంతరం అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఏదేని ఒక వీవీపాట్ లోని ముద్రిత ఓటర్ స్లిప్లను లెక్కిస్తారు.
లెక్కింపు ప్రక్రియను సీసి టీవీ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, భారత ఎన్నికల సంఘం కూడా పర్యవేక్షించేందుకు అవకాశం.
ఓట్ల లెక్కింపు కేంద్రాల వివరాలు
1. సికింద్రాబాద్- ఓయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్
2. సనత్‌నగర్ – ఓయూ ఎంబీఏ కాలేజ్
3. కంటోన్మెంట్- వెస్లీ కాలేజ్
4. అంబర్‌పేట్- రెడ్డి ఉమెన్స్ కాలేజ్, నారాయణగూడ
5. మలక్‌పేట్- అంబర్‌పేట్ మున్సిపల్ స్టేడియం
6. చార్మినార్- ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వనితా కాలేజ్
7. యాకత్‌పుర- ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కమలా నెహ్రూ కాలేజ్
8. బహదూర్‌పుర- మాసాబ్‌ట్యాంక్ సాంకేతిక భవన్
9. కార్వాన్- మాసాబ్‌ట్యాంక్ పాలిటెక్నిక్
10. గోషామహెల్- కోఠీ ఉమెన్స్‌కాలేజ్
11. జూబ్లీహిల్స్- కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం
12. ఖైరతాబాద్- కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం
13. చాంద్రాయణగుట్ట- నిజాం కాలేజ్ లైబ్రరీ బిల్డింగ్
14. నాంపల్లి- ఎల్బీ స్టేడియం బ్యాడ్‌మింటన్ స్టేడియం
15. ముషీరాబాద్- ఎల్బీ స్టేడియం బ్యాడ్‌మింటన్ స్టేడియం