ఏపీలో మరో పరువు హత్య… కన్న కూతురిని దారుణంగా చంపిన తండ్రి!

ప్రస్తుత కాలంలో కుల మతాలకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకపోయినా కొన్నిచోట్ల మాత్రం ఇలాంటి కులమతాలను తమ కుటుంబ పరువుగా భావిస్తూ ఎంతోమంది తమ పిల్లల పట్ల చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు.తమకన్నా తక్కువ కులం ఉన్న వ్యక్తులను ప్రేమించి పెళ్లి చేసుకుంటే కనుక తల్లిదండ్రుల నిర్దాక్షణంగా కన్నబిడ్డలను పొట్టన పెట్టుకుంటున్నారు. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇలాంటి పరువు హత్య సంచలనం రేపుతుంది. పూర్తి వివరాలలోకి వెళితే…

తిరుపతి చంద్రగిరి మండలం రెడ్డివారి పల్లిలో నివాసం ఉన్నటువంటి ముని రాజకుమార్తే మోహనకృష్ణ తండ్రి చేతిలో దారుణంగా హత్యకు గురైంది. మోహనకృష్ణ తల్లి చిన్నప్పుడే మరణించడంతో ఆమెను తన మేనమామ ఎగువ రెడ్డివారి పల్లెలో ఉంటూ తన బాగోగులు చూసుకున్నారు. ఇలా తన మేనమామయ్య ఇంట్లో ఉంటూనే ఈమె డిస్టెన్స్ లో ఇంటర్ చదువుతోంది. ఈ క్రమంలోనే మోహన్ కృష్ణ తమ పక్క గ్రామంలో నివసించే యువకుడితో ప్రేమలో పడింది. ఇక వీరీ ప్రేమ వ్యవహారం కుటుంబ సభ్యులకు తెలియడమే కాకుండా, ఇక వీరిద్దరిది వేరే వేరే కులం కావడంతో మోహన్ కృష్ణ తండ్రి తన కూతురు పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన కుమార్తె వేరే కులం వ్యక్తిని ప్రేమించిందన్న కోపంతో తన పట్ల దారుణంగా ప్రవర్తించి తనని హత్య చేశారు.ఇలా ఆ విషయం బయటపడకుండా ఉండడం కోసం తన కుమార్తె కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని అందరినీ నమ్మించారు. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో అయితే తనది ఆత్మహత్య కాదని హత్యా అని తెలియడంతో అసలు విషయం బయటపడింది అయితే ఈ విషయం వెలుగులోకి రాగానే మోహన్ కృష్ణ తండ్రి పరారీలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు.