భాష్యం సంస్థలకి సంబంధించిన ఒక స్కూల్ కి ముఖ్య అతిధిగా వెళ్లారు అడిషనల్ ఎస్పీ సరిత. విద్యార్థులను మోటివేట్ చేస్తూ ఆమె అద్భుతంగా ప్రసంగించారు. వృత్తిలో ఆమెకు ఎదురైన పలు అనుభవాలను ఆమె విద్యార్థులతో పంచుకున్నారు. ప్రేమ పేరుతో అమ్మయిలు ఎలా మోసపోతున్నారో వివరించారు. ప్రేమ కూడా బాధ్యతాయుతంగా ఉండాలని ఆమె సూచించారు.
తల్లిదండ్రులన్నా, ఉపాధ్యాయులన్నా స్టూడెంట్స్ కి గౌరవం ఉండాలని కథల ద్వారా వివరించారు. ఈ నేపథ్యంలో పాండవుల గురించి ఆమె ఒక కథ చెప్పారు. ఆ కథ చెప్పినప్పుడు ఆమె ఎలాంటి భావోద్వేగానికి లోనయ్యారో వివరించారు. ఆ కథ చదివినప్పుడు నేను కన్నీళ్ల పర్యంతం అయ్యాను అని తెలిపారు. ఇంతకీ ఆమెను అంత భావోద్వేగానికి గురి చేసిన ఆ కథ ఏమిటో తెలుసుకోవాలని ఉందా? అయితే కింద ఉన్న వీడియో చూడండి.