ప్రస్తుత కాలంలో బంధాలు బంధుత్వాలు అన్నీ మరిచి మనం మాత్రమే బాగుండాలని ఆలోచించి ఇతరులకు హాని కలిగిస్తున్నారు. దేశం ఎంత అభివృద్ధి చెందినా కూడా దేశంలో మూఢనమ్మకాలు మాత్రం ఇంకా అలాగే కొనసాగుతున్నాయి. ఈ మూఢనమ్మకాలు వల్ల చేతబడులు చేయడమే కాకుండా మనుషులను కూడా బలి ఇస్తున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ లో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. తనకి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ఒక మహిళ స్వార్థంతో తన తోటి కోడలికి అన్యాయం చేసింది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం 18 నెలల పసికందును బలి ఇచ్చింది. పసిబిడ్డను బలి ఇచ్చిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో కలకలం రేపుతోంది.
వివరాలలోకి వెళితే…ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహ జిల్లా మలక్ పూర్ గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో నివాసం ఉంటున్న రమేష్ కుమార్ తెలిపిన వివరాల మేరకు.. రమేష్ కుమార్ సోదరుడు, ఆయన భార్య సరోజ్ దేవికి పెళ్లి జరిగి సంవత్సరాలు గడుస్తున్నా కూడా పిల్లలు లేరు. వారికి ఇప్పటికే మూడుసార్లు పిల్లలు పుట్టి పురిటిలోనే చనిపోయారు. ఇటీవల సరోజ్ దేవి మళ్లీ నాలుగో సారి గర్భం దాల్చింది. ఈ క్రమంలో మునుపటిలాగే ఈసారి కూడా పిల్లలు పురిటిలోనే చనిపోతారేమో అన్న భయంతో జీవిస్తోంది. ఈ క్రమంలో ఇతరుల ద్వారా ఒక తాంత్రికూడి గురించి తెలుసుకున్న సరోజ్ దేవి ఆతాంత్రికుడిని కలిసింది.
తాంత్రిక పూజలు నిర్వహించే ఆ వ్యక్తి సరోజ్ కు పుట్టబోయే బిడ్డ మరణించకుండా ఉండాలంటే ఒక బిడ్డను బలి ఇవ్వాలని వెల్లడించాడు. ఈ క్రమంలో సరోజ్ దేవికి తోటి కోడలి బిడ్డ మీద కన్ను పడింది. తనకి పుట్టబోయే బిడ్డ బాగుండటం కోసం 18 నెలలు వయసున్న చిన్నారిని నరబలి ఇచ్చి తర్వాత ఆ చిన్నారి శరీరాన్ని ముక్కలుగా కోసి చెరుకు తోటలో పడేసింది. తమ చిన్న కుమారుడు కనిపించకపోవడం ఆందోళన చెందిన రమేష్ కుమార్ కి చెరుకు తోటలో చిన్నారి మృతదేహానికి సంబంధించిన ముక్కలు కనిపించాయి. దీంతో చిన్నారి తల్లి తండ్రులు రోదన వర్ణనాతీతంగా మారింది. తన కుమారుడిని తన వదిన బలి ఇచ్చింది అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పోలీసులు సరోజ్ దేవి మీద కేసు నమోదు చేసుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు.