హిందూపూర్ నియోజకవర్గంలో దారుణం జరిగింది

హిందూపూర్ నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. ఎన్ని చట్టాలు తెచ్చినా కొందరి కామాంధుల ప్రవర్తనలో ఎటువంటి మార్పు రావడం లేదు. అభశుభం తెలియని పసికందుల నుండి రేపో మాపో అంటూ కాలం వెళ్లదీస్తున్న ముసలి మహిళల్ని కూడా వదలడం లేదు. వయసు పైబడుతున్నా కొందరు వ్యక్తులు మాత్రం మానవత్వం మరిచి పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. పసికందులపైన కామకోరికలు తీర్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనే హిందూపూర్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనపై మరింత సమాచారం కింద ఉంది చదవండి.

అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం పరిగి మండలంలోని ఒక గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మనవరాలి వయసున్న చిన్నారిపై ఒక కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. చిన్నారి గట్టిగా కేకలు పెట్టడంతో వదిలేసి పరారయ్యాడు. నారాయణరెడ్డి అనే 65 ఏళ్ళ వృద్ధుడు అదే గ్రామానికి చెందిన 4 సంవత్సరాల చిన్నారిని చాక్లెట్‌ ఇస్తానంటూ ఇంట్లోకి పిలిచాడు. చాక్లెట్‌ మీద ఆశతో ఇంట్లోకి వెళ్లిన చిన్నారితో అసభ్యకర రీతిలో ప్రవర్తిస్తూ అత్యాచారానికి ఒడిగట్టాడు.

చిన్నారి గట్టిగా కేకలు వేస్తూ ఏడుపులంకించుకోవడంతో వదిలేసాడు. ఆ తర్వాత ఆ చిన్నారి తన తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి జరిగింది చెప్పింది. విషయం తెలుసుకున్నతల్లి చిన్నారిని పరిశీలించి అత్యాచారయత్నం జరిగినట్టు తెలుసుకుంది. ఈ విషయాన్నీ మరొక మహిళకి తెలిపి, ఇద్దరు కలిసి నారాయణరెడ్డిపై తిట్ల వర్షం కురిపించారు. ఇక నిందితుడు తాను చేసింది తప్పేనని వారి ఎదుట ఒప్పుకున్నాడు.

చిన్నారిని హాస్పిటల్ కి తీసుకెళ్లి వైద్యం చేయించామని, 500 రూ. ఇస్తానని తెలిపాడు. ఇంకా అవసరం అయితే ఖర్చంతా భరిస్తానని నారాయణరెడ్డి తెలిపినట్టు చిన్నారి తల్లి మొరపెట్టుకుంది. తన భర్త ఇంటికి వచ్చాక తమ బిడ్డకు జరిగిన సంఘటన అతినితో చెప్పుకుంది. దీంతో చిన్నారి తండ్రి కొడతాడేమో అనే భయంతో నిందితుడు ఏటో వెళ్ళిపోయాడు. అనంతరం చిన్నారిని హిందూపూర్ ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు.

వైద్య పరీక్షల అనంతరం చిన్నారిపై అత్యాచారయత్నం జరిగినట్లు వైద్యులు ప్రాధమిక నిర్ధారణ తెలిపారు. పూర్తి నిర్ధారణ కోసం శాంపిల్స్ కర్నూల్ ల్యాబ్ కి పంపామని, రిపోర్ట్స్ వచ్చాక మరిన్ని వివరాలు తెలుపుతామని వెల్లడించారు.సీఐ వెంకటేశులు, ఎస్సై శివ ఆసుపత్రికి చేరుకొని ఈ వ్యవహారంపై వివరాలు సేకరించారు. పరిగి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.