ప్రస్తుతం పరిస్థితులు బావుండడం లేదు. ఎవర్ని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్దం కాని పరిస్తితులు సమాజంలో నెలకొన్నాయి. అలాంటప్పుడు ఇతరుల పట్ల చాలా జాగ్రతగా ఉండాలి. అందులోనూ పరిచయం లేని వ్యక్తుల పైన ఆడపిల్లలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని పడితే వారిని తొందరపడి నమ్మకూడదు. చదువుకోవడానికైనా, ఉదోగానికైనా ఎక్కడికి వెళ్ళినా వీలైనంత వరకు మన పెద్దవారికి చెప్పి.. లేదంటే కుదిరితే వాళ్ళను వెంట తీసుకువెళ్ళడం చాలా ముఖ్యం. ఆడపిల్లలు ఇలా జాగ్రత్తలు తీసుకుంటే క్రైమ్ రేట్ చాలా వరకు తగ్గించవచ్చు. మానవ మృగాళ్ళు ఎక్కువైన నేపధ్యంలో ఏమాత్రం అజాగ్రత్త వహించినా మనం చాలానే కోల్పోవలసి వస్తుంది.
ఇలాంటి ఘటనేఒకటి మహారాష్ట్రలో బుసావల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… ఇరవైనాలుగేళ్ళ యువతి డిగ్రీ పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం వెతుకుతుంది. ఓరోజు ట్రైన్‌లో పరిచయమైన యువకుడికి తన వివరాలు తెలుపగా… చర్లపల్లి రైల్వే కాలనీకి చెందిన వివేకానంద (42) రియల్ ఎస్టేట్ వ్యాపారి. తన వ్యాపారం రిత్యా పని మీద మహారాష్ట్రకు వెళ్ళాడు. అక్కడ ఓ స్నేహితుడి ద్వారా ట్రైన్‌లో వివేకానందుకు ఓ యువతి పనిచయం అయింది. ఆ అమ్మాయి అతన్ని నమ్మి తనకు ఉద్యోగం కావాలని చెప్పగా… దీంతో ఆమెకు మొబైల్ నెం ఇచ్చాడు. దాంతో పరిచయం పెరిగి ఇద్దరు చాటింగ్ మొదలు పెట్టారు. ఆ తర్వాత హైదరాబాద్‌రమ్మని వస్తే ఉద్యోగం చూపిస్తానని నమ్మించసాగాడు. దీంతో ఆమె ఈ నెల 18న ఉదయం మహారాష్ట్ర నుంచి సికింద్రాబాద్‌కు వచ్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలోని ఓ లాడ్జిలో బస చేసింది. శనివారం రాత్రి 10.30గంటల సమయంలో తన స్నేహితుడు రాజుతో కలిసి వివేకానంద సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చి ఆ యువతిని కారులో ఎక్కించుకున్నాడు.
ఆ తర్వాత వారిద్దరు కలిసి కారులోనే మద్యం సేవించారు. ఆ యువతితో కొన్ని చిరుతిళ్ళు బలవంతంగా తినిపించారు. దీంతో ఆమెకు కాస్త మత్తు ఎక్కింది. దాంతో ఆమె నేను హోటల్‌కు వెళతానని చెప్పగా…అనంతరం అక్కడే ఉన్న ఓ హోటల్‌కు మారాలని ఆ యువతిపై ఒత్తిడి తెచ్చాడు. దీనికి ఆమె ఒప్పుకోలేదు. దీంతో మరోసారి హోటల్‌కు రమ్మని చెప్పి రాత్రి 11.30 గంటల సమయంలో అక్కడ హోటల్‌ను తనే బుక్ చేశాడు. ఆమెను పైకి వెళ్లమని చెప్పి కొద్దిసేపటి తర్వాత తనతో పాటు ఉన్న రాజును కిందనే ఉంచి బ్యాగును తీసుకుని హోటల్ గదికి వెళ్లాడు. మళ్లీ ఎందుకు వచ్చావని ఆమె ప్రశ్నించింది. బ్యాగు ఇచ్చేందుకు అని చెప్పి ఆమెను చంపుతానని కూడా బెదిరించాడు. అప్పటికే ఆమెకు కొద్దిగా మగతగా ఉండి. దీంతో తనకు తెలియకుండానే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టి గదిలో నుంచి బయటకు వచ్చాడు. కొద్దిసేపటి తర్వాత ఆమెకు మెలకువ వచ్చి చూసుకుంటే జరగాల్సిందంతా జరిగిపోయింది. విషయం తెలుసుకుని 100 డయల్‌కు ఫోన్ చేసింది. వెంటనే గోపాలపురం డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ వెంకటేష్ సదరు హోటల్‌కు వెళ్లి బాధితురాలి ఫిర్యాదు స్వీకరించారు. అనంతరం ఆమె నగరంలోనే ఉన్న బంధువులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న రాజు కారులో వివేక్‌ను తీసుకుని వెళ్లిపోయాడు. పోలీసులు నిందితుడు వివేక్‌తో పాటు అతనికి సహకరించిన రాజును ఆదివారం అరెస్టు చేశారు. ఇలా ఎవరిని పడితే వాళ్ళని ఒక్కరోజు పరిచయంతో నమ్మడం వల్ల ఎలాంటి పరిస్థితులకు ఒడిగట్టాల్సి వస్తుందంటే… చెప్పలేము. అందుకే ఏ పని చూసినా ఆచితూచి అడుగు వెయ్యాలంటూ పెద్దవారు చెబుతుంటారు.