బ్రేకింగ్ న్యూస్: విశాఖలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య

విశాఖపట్టణంలో విషాదం జరిగింది. గ్రావిటీ జూనియర్ కళాశాలలో నీట్ లాంగ్  టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థిని అమృత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురానికి చెందిన అమృత హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.