భద్రాద్రి జిల్లాలో విషాదం జరిగింది. సీతారామ కాల్వ ప్రాజెక్టులో పడి ఇద్దరు మృతి చెందారు. వారు ఈతకి వెళ్లి మరణించారా లేక ప్రమాదవశాత్తు పడి మరణించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల్లో పన్నెండేళ్ల బాలుడు ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.