బ్రేకింగ్ న్యూస్‌: తూర్పుగోదావరి జిల్లాలో నాటు పడవ బోల్తా

తూర్పుగోదావరి జిల్లాలో నాటుపడవ బోల్తా పడింది. ఐ.పోలవరం మండలం పశువుల లంక వద్ద గోదావరిలో ప్రమాదవశాత్తు నాటు పడవ బోల్తా పడింది.  ప్రమాదం జరిగిన సమయంలో 20 మంది అందులో ప్రయాణిస్తుండగా స్థానికులు 17 మందిని కాపాడారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. వారి కోసం గజ ఈతగాళ్ల సహాయంతో గాలిస్తున్నారు.