అనంతపురం జిల్లా తాడిపత్రి స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం

అనంతపురం జిల్లాలో విషాదం జరిగింది. తాడిపత్రిలోని ఉక్కు కర్మాగారంలో గ్యాస్ లీకై ఆరుగురు కార్మికులు మృతి చెందారు. మరో  ఐదుగురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్సనిమిత్తం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో మిగతా కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు, రక్షణ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.స్టీల్ ప్లాంట్ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకొని కారణంగానే ప్రమాదం జరిగిందని ఆరోపణలు వినిసిస్తున్నాయి.  ఆరుగురు మృతి చెందటంతో వారి బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని మృతుల బంధువులు కోరుతున్నారు. అనంతపురంతో పాటు  ఒడిశా, బీహర్ కు చెందిన కార్మికులుగా  ఈ ప్లాంట్ లో పనిచేస్తున్నారు.