నేటి మార్కెట్ లో బంగారం, వెండి ధరలివే

బంగారం ధరలు భగభగ మంటున్నాయి. ఫిబ్రవరి మాసంలో మంచి ముహుర్తాలు ఉండడంతో పెళ్లిలు, ఇతర ఫంక్షన్లు అధికంగా ఉన్నాయి. దీంతో రేటు పెరిగినా బంగారానికి గిరాకీలు తగ్గడం లేదు. మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్ లో రూ.34,430, విశాఖ పట్నంలో రూ. 34,400, ప్రొద్దుటూరులో రూ. 33,720, చెన్నైలో రూ. 33,410 గా ఉంది.

ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్ లో రూ. 31,880, విశాఖపట్నంలో 31,640, ప్రొద్దుటూరులో రూ. 31,220, చైన్నైలో రూ. 31, 940 గా ఉంది.

వెండి కిలో ధర హైదరాబాద్ లో రూ. 41, 660, విశాఖపట్నంలో రూ. 41,700, ప్రొద్దుటూరులో రూ.41,500, చెన్నైలో రూ.43,800 వద్ద ముగిసింది.