పెట్టుబడి పెట్టేవాళ్లకు అదిరిపోయే స్కీమ్ ఇదే.. రూ.100 పెట్టుబడితో రూ.30 లక్షలు పొందే ఛాన్స్!

money4-getty

మనలో చాలామందికి కోటీశ్వరులం కావాలనే ఆశ ఉంటుంది. అయితే ఎక్కడ పెట్టుబడి పెట్టాలో ఎలా పెట్టుబడి పెట్టాలో తెలియకపోవడం వల్ల చాలామంది డబ్బులను ఇన్వెస్ట్ చేసే విషయంలో వెనుకడుగు వేస్తూ ఉంటారు. సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల దీర్ఘకాలంలో మంచి లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. నెలకు 3000 రూపాయల చొప్పున మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే రూ.30 లక్షలు మీ సొంతమవుతుంది.

వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా దీర్ఘకాలంలో మంచి ఆదాయం సొంతం చేసుకోవాలని భావించే వాళ్లు ఇప్పటినుంచి పొదుపుపై దృష్టి పెడితే మంచిది. దీర్ఘకాలంలో కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఏకంగా 30 శాతం రాబడిని అందించిన నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ఎంత ఉత్తమమైన నిర్ణయమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

దీర్ఘకాలంలో పెట్టుబడులు పెట్టాలని భావించే వాళ్లకు మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. పిల్లల చదువు, వివాహం దృష్టిలో ఉంచుకుని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో మంచి రాబడి సొంతమవుతుంది. ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేస్తే మాత్రం కోట్ల రూపాయల లాభాలు పొందవచ్చు. నెలకు 5000 చొప్పున 28 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా 2.5 కోట్ల రూపాయలు పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.

5 శాతం యాన్యువల్ స్టెప్ అప్ ఆప్షన్ ను ఎంచుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అదిరిపోయే లాభాలను సొంతం చేసుకోవచ్చు. నిపుణుల సలహాలతో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం అదిరిపోయే లాభాలు సొంతమవుతాయి