అద్భుతమైన స్కీమ్.. ఆడపిల్ల పుడితే ఏడాదికి రూ.5000 సులువుగా పొందే అవకాశం?

దేశంలో ఆడపిల్లల సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది. ఆడపిల్లల సంఖ్య తగ్గుతుండటం వల్ల పెళ్లి కాని యువకుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఆడపిల్లల తల్లీదండ్రులకు ప్రయోజనం చేకూరేలా కొన్ని స్కీమ్స్ అమలవుతున్నాయి. హర్యానా లాడ్లీ యోజన పేరుతో హర్యానా రాష్ట్రంలో ఒక స్కీమ్ అమలవుతుండగా ఈ స్కీమ్ వల్ల ఆడపిల్లలకు ఏడాదికి 5000 రూపాయలు అందనుందని తెలుస్తోంది.

2005 సంవత్సరం ఆగష్టు నెల 30వ తేదీ తర్వాత జన్మించిన వాళ్లు మాత్రమే ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. 2 లక్షల రూపాయల కంటే ఆదాయం తక్కువగా ఉన్నవారు మాత్రమే ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వ్యక్తులు సైతం ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. కిసాన్ వికాస్ పత్ర ద్వారా హర్యానా ప్రభుత్వం ఈ డబ్బును ఆడపిల్లల తల్లీదండ్రులకు అందిస్తోంది.

అవసరమైన ధృవీకరణ పత్రాలను అందించడం ద్వారా ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. లాడ్జీ యోజన స్కీమ్ అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. హర్యానా రాష్ట్రానికి చెందిన వాళ్లు మాత్రమే ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఆడపిల్లల తల్లీదండ్రులు ఈ స్కీమ్ పై దృష్టి పెడితే మంచిది.

ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వాళ్ల కూతురి జనన ధృవీకరణ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. సమీపంలోని బీమా కార్యాలయం లేదా అంగన్‌వాడీ కేంద్రం ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని వర్గాల ప్రజలకు ఈ స్కీమ్ ద్వారా మేలు జరుగుతుందని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం ఈ తరహా స్కీమ్స్ ను అమలు చేస్తే మంచిది.