ఎల్ఐసీ సూపర్ పాలసీ.. రూ.171 చెల్లిస్తే ఏకంగా రూ.28 లక్షలు పొందే అవకాశం?

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ప్రయోజనం చేకూరేలా ఎన్నో పాలసీలను అందిస్తోంది. వినియోగదారుల నుంచి వస్తున్న స్పందనకు అనుగుణంగా ఎల్‌ఐసీ కొత్త పాలసీలను సైతం అందుబాటులోకి తెస్తోంది. పిల్లల భవిష్యత్తు కోసం పాలసీ తీసుకోవాలని భావించే వాళ్లు ఎల్‌ఐసీ జీవన్ తరుణ్ పాలసీని తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

90 రోజుల నుంచి 12 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పిల్లల కోసం ఈ పాలసీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేసేవాళ్లకు మనీ బ్యాక్ ఆప్షన్ ఉంటుంది. ఈ పాలసీ నాన్ లింక్డ్ మనీ బ్యాక్ పాలసీ కావడం గమనార్హం. ఈ స్కీమ్ లో రోజుకు 171 రూపాయల చొప్పున 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లిస్తే 23 సంవత్సరాలకు పాలసీ మెచ్యూరిటీ అవుతుంది.

పాలసీ మెచ్యూరిటీ సమయం ఆధారంగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పాలసీకి గరిష్ట పరిమితి లేకపోవడంతో ఎక్కువ మొత్తం కూడా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్ల సమయంలో ఈ పాలసీ ఎంతగానో ఉపయోగపడుతుంది. పిల్లల కోసం డబ్బులు సేవ్ చేయాలని భావించే వాళ్లు ఈ పాలసీని తీసుకుంటే మంచిది.

సమీపంలోని ఎల్‌ఐసీ బ్రాంచ్ లేదా ఎల్‌ఐసీ ఏజెంట్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. చిన్న పిల్లల కోసం చాలా తక్కువ పాలసీలు అందుబాటులో ఉండగా ఈ పాలసీల గురించి తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చెప్పవచ్చు.