ఎల్ఐసీ నుంచి అదిరిపోయే పాలసీ.. ఈ పాలసీ తీసుకుంటే ఏకంగా 3 బెనిఫిట్స్!

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో పాలసీలను అమలు చేస్తుండగా ఈ పాలసీల వల్ల ఎన్నో బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎల్ఐసీ నివేశ్ ప్లస్ పేరుతో ఒక పాలసీని అమలు చేస్తుండగా ఈ పాలసీని తీసుకోవడం ద్వారా ఎన్నో అదిరిపోయే బెనిఫిట్స్ ను పొందవచ్చు. ఈ పాలసీ సింగిల్ ప్రీమియం యులిప్ ప్లాన్ కాగా ఇందులో నాలుగు రకాల ఫండ్ ఆప్షన్స్ ఉంటాయి.

ఇన్సూరెన్స్ కమ్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ అయిన ఈ పాలసీ తీసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. పన్ను ఆదా చేసుకోవాలని భావించే వాళ్లకు ఈ పాలసీ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కనీసం లక్ష రూపాయల నుంచి ఎంత మొత్తమైనా ఈ స్కీమ్ లో డిపాజిట్ చేసే ఛాన్స్ ఉండగా 25 సంవత్సరాలు మెచ్యూరిటీగా ఉంది. బాండ్, సెక్యూర్డ్, బ్యాలెన్స్‌డ్, గ్రోత్ ఆప్షన్లు ఉండగా నచ్చిన ఆప్షన్ ను ఎంచుకోవచ్చు.

సంవత్సరంలో నాలుగుసార్లు మాత్రమే ఫండ్ ఆప్షన్ ను మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. రిస్క్ కు వెనుకాడని వారికి గ్రోత్ ఆప్షన్ బెస్ట్ కాగా రిస్క్ వద్దని ఫీలయ్యే వారు బాండ్, సెక్యూర్డ్ ఆప్షన్స్ ను ఎంచుకోవచ్చు. ఈ పాలసీ తీసుకున్న వాళ్లు లక్ష ఇన్వెస్ట్ చేస్తే 10 రెట్లు లైఫ్ కవరేజ్ పొందే అవకాశం ఉంటుంది. 70 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకుంటే మంచిది.

ఈ పాలసీని తీసుకున్న వాళ్లు ఫండ్ మేనేజ్‌మెంట్ చార్జీలతో పాటు ఇతర చార్జీలను సైతం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పాలసీ వల్ల ఎన్నో బెనిఫిట్స్ ను పొందవచ్చు. ఈ పాలసీ తీసుకోవాలనే ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే తీసుకుంటే మంచిది. ఈ పాలసీ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో బెనిఫిట్స్ ను పొందవచ్చు.