లాకర్లలో డబ్బు దాస్తున్నటువంటి వినియోగదారులు సదరు బ్యాంకుతో సరికొత్త ఒప్పందం చేసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది. ఇందుకోసం రూ. 200 స్టాంపు పత్రాలపై నోటరీ చేయించి బ్యాంకులో ఇవ్వాలని తెలిపింది. నిజానికి కొత్త ఒప్పందాలకు సంబందించిన గడువు జనవరి 1తోనే ముగిసింది. అయితే ఈ ఒప్పందం చేసుకొని వినియోగదారుల లాకర్స్ బ్యాంకులు సీజ్ చేశాయి. ఈ క్రమంలోనే చాలామంది ఒప్పందం చేసుకోకపోవడంతో ఈ గడువును డిసెంబర్ 31వ తేదీ వరకు పెంచారు.
ఈ నేపథ్యంలో సీజ్ చేసిన లాకర్లను తిరిగి వినియోగించుకునే సదుపాయాన్ని వినియోగదారులకు కల్పించాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.వచ్చే జూన్ 30 నాటికి 50% ఒప్పందాలు పూర్తి కావాలని ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది అలాగే సెప్టెంబర్ నెలకు 75% డిసెంబర్ 31వ తేదీకి 100% ఒప్పందాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ బ్యాంకులను ఆదేశించింది.
ఇలా గడువు తేదీ గురించి వినియోగదారులకు తక్షణమే సమాచారం అందవేయాలని సదరు బ్యాంకులకు ఆర్బిఐ సూచించింది. కొత్త ఒప్పందం ప్రకారం వినియోగదారులు లాకర్లలో నగదు దాచుకోకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. లాకర్ కేటాయించే సమయంలో కస్టమర్లకు సంబంధించిన పూర్తి వివరాలను బ్యాంకులు నమోదు చేయాలని ఆర్బీఐ సూచించింది. అదేవిధంగా లాకర్ సదుపాయాన్ని పొందడం కోసం వినియోగదారులు ఏటా చెల్లించవలసిన నిర్వహణ సొమ్మును అంతమేర వడ్డీ వచ్చేలా ముందుగానే ఖాతాదారులతో డిపాజిట్ చేయమని సూచించింది.