ఎస్బీఐ నుంచి మరో అదిరిపోయే స్కీమ్.. పెట్టుబడికి రెట్టింపు డబ్బులు పొందే అవకాశం?

sbi-3-1-2-167419588016x9

దేశీయ బ్యాంకింగ్ దిగజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తుండగా ఆ స్కీమ్స్ ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఎస్బీఐ స్కీమ్స్ ద్వారా అదిరిపోయే బెనిఫిట్స్ ను పొందవచ్చు. ప్రస్తుతం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఇన్వెస్ట్ చేసినా ఎక్కువ మొత్తం వడ్డీ పొందే అవకాశం అయితే లేదనే సంగతి తెలిసిందే. సీనియర్ సిటిజన్ల కోసం ఎస్బీఐ వి కేర్ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం.

ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎక్కువ వడ్డీతో పాటు ఇతర ప్రయోజనాలను పొందవచ్చు. 5 ఏళ్ల నుంచి పదేళ్ల టెన్యూర్ తో డిపాజిట్ చేసేవాళ్లు 7.5 శాతం వడ్డీ రేటు పొందే అవకాశం ఉంటుంది. సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు సులభంగానే ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది.

టీడీఎస్ ను తగ్గించి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు వడ్డీని అందిస్తారని సమాచారం అందుతోంది. ఎస్‌బీఐ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు పదేళ్లలో డబ్బులు రెట్టింపు అవుతాయని సమాచారం అందుతోంది. రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా 6.5 శాతం వడ్డీ రేటు లభిస్తుందని సమాచారం అందుతోంది.

ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉండనుందని తెలుస్తోంది. అమృత్ కలాష్ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ వ్యవధిని సైతం ఎస్బీఐ పొడిగించగా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కూడా ఎన్నో ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.