‘టాక్సీవాలా’లేటెస్ట్ కలక్షన్స్ ఎంతటే

యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’బాక్సాఫీసు వద్ద చక్కటి విజయం సాధించింది. నవంబరు 16న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ అందుకుంది. . రిలీజ్ కు ముందే పైరసి వచ్చేయటం, సినిమా యావరేజ్ అనే టాక్ నడవటంతో ఈ సినిమా రిలీజ్ రోజు కలెక్షన్స్ పై వాటి ప్రభావం ఉంటుందని అంతా భావించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 20 కోట్లు (గ్రాస్‌) రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నారు. విజయ్‌ మళ్లీ ఫాంలోకి వచ్చారు.

‘టాక్సీవాలా’ సినిమాకు రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వం వహించారు. ప్రియాంక జవాల్కర్‌ హీరోయిన్. మాళవికా నాయర్‌, కళ్యాణి, ఉత్తేజ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా సినిమాను నిర్మించాయి. ఆత్మని శరీరంతో వేరు చేయొచ్చనే విషయాన్ని జోడించి ఈ చిత్రానికి సైన్స్ ఫిక్షన్ టచ్ ఇచ్చారు. చిత్రం విడుదలకు ముందే పైరసీకి గురైనప్పటికీ బాక్సాఫీసు వద్ద అద్భుత విజయం సాధించడం విశేషం.

విజయ్‌ ఇటీవల ‘నోటా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం ఆయన ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో రష్మిక హీరోయిన్  పాత్ర పోషిస్తున్నారు. భరత్ కమ్మ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.