అక్కడ కూడా ‘టాక్సీవాలా’కలెక్షన్స్ కేక

యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ రెండు వారాల క్రిందట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ కు ముందే పైరసి వచ్చేయటం, సినిమా యావరేజ్ అనే టాక్ నడవటంతో ఈ సినిమా రిలీజ్ రోజు కలెక్షన్స్ పై వాటి ప్రభావం ఉంటుందని అంతా భావించారు. అయితే అందరి అంచనాలను తలక్రిందలు చేస్తూ బాక్సాఫీసు వద్ద బ్రహ్మాండమైన వసూళ్లు రాబడుతోంది.తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన టాక్సీ వాలా అందరికీ లాభాలు తెస్తున్నాడు .

ముఖ్యంగా ఈ చిత్రానికి వేరే సినిమాల ను నుండి పోటీ లేకపోవడంతో బ్రేక్ ఈవెన్ ను దాటేసి, మంచి లాభాల ను తీసుకువస్తుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక..తమిళనాడులో చెన్నైలో కూడా దుమ్ము దులుపుతున్నాడు.

ఇంతకుముందు విజయ్ నటించిన ‘గీత గోవిందం’ అక్కడ భారీ వసూళ్లను రాబట్టడంతో టాక్సీవాలా కు చాలా ప్లస్ అయ్యింది. ఇక ఈచిత్రం 9రోజులకుగాను చెన్నై లో 53లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించి సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది. దాంతో తమిళనాట కూడా విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ రేంజిలోకి వెళ్లిపోయిందో అర్దం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోషల్‌మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేసింది. సినిమాను బ్లాక్‌బస్టర్‌ చేసినందుకు ధాంక్స్ చెప్పింది.

‘టాక్సీవాలా’ సినిమాకు రాహుల్‌ దర్శకత్వం వహించారు. ప్రియాంక జవాల్కర్‌ హీరోయిన్. మాళవికా నాయర్‌, కళ్యాణి, ఉత్తేజ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జీఏ2 పిక్చర్స్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. జేక్స్ బిజాయ్ సంగీతం అందించారు.

ప్రస్తుతం విజయ్ ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో రష్మిక హీరోయిన్ పాత్ర పోషిస్తున్నారు. భరత్ కమ్మ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.