‘టాక్సీవాలా’: ఫ్యాన్స్ కు ఏడు నిముషాల శుభవార్త

విజయ్‌దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌, మాళవికా నాయర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘టాక్సీవాలా’. జి.ఎ 2 పిక్చర్స్‌, యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.ఎన్‌ నిర్మించారీ చిత్రాన్ని. ఈ సినిమా విడుద‌లై అఖండ విజ‌యం సాధించిన ఈ సందర్భంగా ఈ సినిమాకు ఏడు నిముషాల ఫుటేజ్ ని కలుపుతున్నారు. సినిమాలో హిట్ అయిన క్యారక్టర్ హాలీవుడ్ చుట్టూ తిరుగుతూంది కామెడీ.

హీరో విజ‌య‌దేవ‌ర‌కొండ మాట్లాడుతూ…ఒక కొత్త క‌థ‌, ఒక కొత్త డైరెక్ట‌ర్, ఒక కొత్త ప్రొడ్యూస‌ర్ రెండు పెద్ద బ్యాన‌ర్లు కాని మొత్తం కొత్త కాస్ట్ అండ్ క్రూ ఒక సంవ‌త్స‌రం పాటు సినిమా తీశాము.జులైలో ఫ‌స్ట్ ట్రైల‌ర్ రిలీజ్ అయి ఎప్పుడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుందో తెలియ‌ని సినిమా, గీతాఆర్ట్స్ ముందుకు వ‌చ్చి న‌డిపించిన సినిమా, ఆగ‌స్ట్‌లో రా ఫుటేజ్ లీక్ అయిన సినిమా. రిలీజ్‌కి మూడు నెల‌ల ముందు పూర్తిగా లీక్ అయిన సినిమా. ఈ సినిమా గురించి ఎన్ని నెగిటివ్ మాట‌లు వినాలో అన్నీ విన్నాను. ఆ త‌ర్వాత న‌వంబ‌ర్ 18న ఈ చిత్రం విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా అయింది.

ఈ సినిమాకి ఎంజాయ్ చేసినంత ఏ సినిమాకి ఎంజాయ్ చెయ్య‌లేదు. అస‌లు పూర్తిన స‌చ్చిన సినిమాతోని డాన్స్ ఆడించాము థియేట‌ర్ల‌లో. ఎస్‌కెఎన్ ఈ సినిమా గురించి ఎంత విన్నా కూడా అలాగే స్ర్టాంగ్‌గా నిల‌బ‌డ్డాడు. రెండు పెద్ద బ్యానర్లు కూడా బాగా స‌పోర్ట్ చేశాయి. రాహుల్ కూడా చాలా టెన్ష‌న్ ప‌డ్డాడు. ముందుగా మా టీమ్ అంద‌రికీ నా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

బ‌న్నీఅన్న‌, ప్ర‌భాస్ అన్న‌,చ‌ర‌ణ్ అన్న‌, వ‌రుణ్ అన్న‌, ర‌ష్మిక‌మంద‌న్న‌, రాశిఖ‌న్నా, దుల్క‌ర్ స‌ల్మాన్‌, ఇలా ఎంతో మంది ట్వీట్ చేసి మా చిత్రాన్ని స‌పోర్ట్ చేశారు. మీరంద‌రూ ఇచ్చిన ఆద‌ర‌ణ వ‌ల్లే సినిమా, సినిమాలోని టెక్నీషియ‌న్లు ఇంత దూరం రాగ‌లిగారు. మీరంద‌రూ థీయేట‌ర్లు నింప‌డం వ‌ల్లే అని అన్నారు. మా అమ్మ‌గారి త‌రుపున కూడా మీ అంద‌రికి ఈ సినిమాని ఇంత స‌క్సెస్ చేసినందుకు కృత‌జ్ఞ‌త‌లు అని అన్నారు.