సూర్య ‘బందోబస్త్ ‘ బిజినెస్,ఏడుపొకటే తక్కువ
సూర్య హీరోగా నటిస్తున్న తమిళ సినిమా ‘కాప్పాన్’. తెలుగులో ‘బందోబస్త్’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్య, కె.వి. ఆనంద్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ అవ్వాలంటే ముందు బిజినెస్ కావాలి. కానీ ఈ సినిమాకు ఎంత ప్రమోషన్ చేసినా కొనేవాళ్లు ధైర్యం చేయటంలేదంటున్నారు.
వరస ఫ్లాఫ్ లతో ఉండే హీరోల కొత్త సినిమాలకు బిజినెస్ కావటం కష్టమే. ఇప్పుడు అదే పరిస్దితి తమిళ స్టార్ హీరో సూర్య కు ఎదురైంది. ఒక టైమ్ లో సూర్య సినిమా అంటే ఇక్కడ పెద్ద హీరోలతో సమానంగా బిజినెస్ అవటం, రిలీజ్ జరిగేది. ముఖ్యంగా సింగం సీరిస్ లో వచ్చిన సినిమాలు మాస్ లోకి బాగా వెళ్లాయి. సూర్య సినిమా అంటే తెలుగులో మినిమం పది కోట్లు బిజినెస్ చేసేది. ఇప్పుడు అదంతా మాయమైపోయింది. వరుసగా ఆరు సినిమాలు దాకా బోల్తా కొట్టడం దెబ్బ కొట్టింది.
మరీ ముఖ్యంగా రీసెంట్ గా రిలీజైన ఎన్.జీ.కే తో బయ్యర్లు దారుణంగా నష్టపోయారు. దాంతో సూర్య సినిమా అనేసరికి.. తెలుగులో బయ్యర్లు భయపడుతున్నారు. మోహన్‌లాల్ లాంటి స్టార్ ఈ సినిమాలో ఓ కీలకపాత్ర పోషించినా ఫలితం లేకుండా పోతోంది. వచ్చే నెల 20న విడుదల కానున్న ఈ సినిమాకు ఇప్పటి వరకూ తెలుగులో ఒక్క ఏరియాని కూడా అమ్మలేకపోయారు. అప్పటికీ ఎన్ జీకే చేసిన బయ్యర్లుని పిలిచి మాట్లాడినా ఫలితం లేకుండా పోతోంది ఎంతో కొంతకు తీసుకోండి..డబ్బులు వచ్చాకే మిగతాది ఇవ్వండి అన్నా ఎవరూ ఆసక్తి కలగటం లేదు. ఇక్కడ తెలుగులో ఈ సిట్యువేషన్ అనుకుంటే..తమిళంలోనూ పరిస్థితి ఇంచుమించుగా ఇలానే ఉంది.