ఏంటి ‘బేబి’ ఈ కలెక్షన్స్? షాక్ అవుతున్నారు

సమంత ప్రధాన పాత్ర లో ఈ శుక్రవారం విడుదల అయిన చిత్రం ఓ బేబీ. కొరియన్ చిత్రం మిస్ గ్రానీ రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం ఈ మధ్య కాలం లో వచ్చిన చాలా సినిమాల కన్నా ఎక్కువగా మీడియా లో ప్రచారం పొందింది. అందుకు సురేష్ బాబు టీమ్ బాగా కష్టపడి సినిమా ని ప్రమోట్ చేశారు. సమంత సైతం సోషల్ మీడియాలో ఈ సినిమా కబుర్లు, మీడియాలో ఇంటర్వూలు ఇచ్చి రచ్చ రచ్చ చేసి అందరి దృష్టిలో పడేలా చేసింది. దేవి థియేటర్ దగ్గర సమంత కి ఏకంగా కటౌట్ కూడా పెట్టేసారు అభిమానులు.

దాంతో సమంత కెరీర్ లో ఈ సినిమా చాలా స్పెషల్ అని అందరూ భావించి మంచి ఓపినింగ్స్ రాబట్టింది. రిలీజ్ కు ముందు రోజు రాత్రి ప్రీమియర్స్ తో నే ఈ సినిమా కి పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రీమియర్ షో ల ద్వారా 145,135 డాలర్లు రాబట్టిందని అంచనా. ట్రేడ్ రిపోర్ట్ ల ప్రకారం ఈ చిత్రం 2019లో రిలీజైన సినిమాల ప్రీమియర్ షో కలెక్షన్స్ లో ఆరవ స్దానంలో ఉంది.

సినిమా మార్నింగ్ షో నుండే ఈ సినిమా కి మంచి పాజిటివ్ టాక్ రావడం, రివ్యూలు సూపర్ పాజిటివ్ గా ఉండటంతో సినిమా కి తిరుగులేదని బాక్స్ ఆఫిస్ వర్గాలు చెప్తున్నాయి. ఇదే జోరు కొనసాగితే ఓ బేబి కి తిరుగు ఉండదు అని చెప్పుకోవచ్చు.

ఓ బేబిలో సమంత.. స్వాతి అనే సింగర్ క్యారెక్టర్‌లో కనిపించగా, నాగశౌర్య ఇంపార్టెంట్ రోల్ చేసాడు.. రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి డైలాగ్స్ : లక్ష్మీ భూపాల, కెమెరా : రిచర్డ్ ప్రసాద్, ఎడిటింగ్ : జునైద్ సిద్దిఖీ, సంగీతం : మిక్కీ జె.మేయర్, కో-ప్రొడ్యూసర్ : వివేక్ కూచిభోట్ల, యువరాజ్ కార్తికేయన్, వంశీ బండారు, నిర్మాణం : సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ క్రాస్ పిక్చర్స్ .