Home Box Office షాకింగ్ రేటుకు వరుణ తేజ్ ‘వాల్మీకి’ నైజాం రైట్స్

షాకింగ్ రేటుకు వరుణ తేజ్ ‘వాల్మీకి’ నైజాం రైట్స్

  వరుణ తేజ్ ‘వాల్మీకి’ నైజాం రైట్స్ ఎంతకు ఇచ్చేసారంటే..

వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్మీకి’. ఈ చిత్రానికి హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మిక్కీ జే మేయర్‌ బాణీలు అందిస్తున్న ఈ చిత్రం… తమిళ చిత్రం ‘జిగర్తాండ’కు తెలుగు రీమేక్‌.ఈ చిత్రాన్ని సెప్టెంబరు 13 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలిజ్ బిజినెస్ ప్రారంభమైపోయింది. అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం నైజాం రైట్స్ ని ఇస్మార్ట్ శంకర్ చిత్రం బయ్యర్ శ్రీనివాసరావు 8.10 కోట్లకు తీసుకున్నట్లు సమాచారం.

‘వాల్మీకి’ చిత్రంలో డింపుల్‌ హయాతీ అనే హైదరాబాద్‌ అమ్మాయి ఓ స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేస్తోంది. సాధారణంగా ఐటం లేదా స్పెషల్ సాంగ్స్ అంటే బాలీవుడ్‌ నటీమణులను, విదేశీ భామలను ఎంపికచేసుకుంటూ ఉంటారు. కానీ, హరీశ్‌ శంకర్‌ మాత్రం ఈసారి తెలుగమ్మాయికి అవకాశం ఇచ్చారు. అలాగే ఈ చిత్రంలో తమిళ నటుడు అథర్వా మురళి విలన్ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్‌, అథర్వలతో కలిసి డింపుల్‌ ఆడిపాడనున్నారు.

ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతోంది. తమిళంలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న ‘జిగర్తాండ’ సినిమాకు ఇది రీమేక్‌గా రాబోతోంది. ‘దేవి 2’ సినిమాలో డింపుల్‌ ప్రభుదేవాతో కలిసి కీలక పాత్రలో నటించారు.

వరుణ్‌ ఇటీవల ‘f2’ సినిమాతో హిట్‌ కొట్టిన విషయం తెలిసిందే. దాని తర్వాత వరుణ్‌ నటిస్తున్న చిత్రమిది. హరీశ్‌ శంకర్‌ మెగా ఫ్యామిలీకి ‘గబ్బర్‌ సింగ్‌’, ‘సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌’ వంటి హిట్‌ చిత్రాలను అందించారు. దీంతో ‘వాల్మీకి’పై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి.

- Advertisement -

Related Posts

యాంకర్ ప్రదీప్ బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?

యాంకర్ గా బుల్లితెరపై దశాబ్ద కాలంగా ఎంతగానో క్రేజ్ అందుకుంటున్న ప్రదీప్ మాచిరాజు మొత్తానికి వెండితెరపై కథానాయకుడిగా ఎంట్రీ ఇవ్వడబికి సిద్ధమయ్యాడు. 30రోజుల్లో ప్రేమించడం ఎలా? ఈ 29కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

అల్లుడికి అల్లరోడికి డెడ్ లైన్.. రూ.2కోట్లు తెచ్చారంటే..

టాలీవుడ్ లో ఈ సంక్రాంతి కొంతమంది హీరోలకు బాగానే కలిసొచ్చింది. బయటవాడైన విజయ్ మాస్టర్ సినిమాతోనే తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నాడు. ఇక క్రాక్ తో మాస్ రాజా బాక్సాఫీస్ వద్ద...

క్రాక్ లెక్క.. పది రోజులకు పది కోట్లు!

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజను తక్కువ అంచనా వేసినవారే ఇప్పుడు ఆయన వెంటపడి డేట్స్ ఇస్తే అడిగినంత ఇస్తామని అంటున్నారు. మొన్నటివరకు రెమ్యునరేషన్ కూడా ఎక్కువే అన్నవాళ్ళు కూడా ఇప్పుడు డైరెక్టర్ గోపిచంద్...

Box office: విజయ్ మరో 150.. ఇది మామూలు దెబ్బ కాదు

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ మార్కెట్ ఉన్న టాప్ హీరోల్లో ఒకరని మరోసారి ఋజువయ్యింది. తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ స్టార్ హీరో తన...

Latest News